Asianet News TeluguAsianet News Telugu

అరటి పండు తింటే.. మగపిల్లలు పుడతారా..?

అదేంటి? అరటిపండు తింటే అబ్బాయి లేకపోతే అమ్మాయి పుడుతుందా? అసలు ఇది ఎలా సాధ్యం? అదంతా తూచ్ అని చాలా మంది కొట్టిపారేయచ్చు. అయితే.. అది నిజమేనని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. చాలా మంది గర్భిణీలపై జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 
 
Common Myths Of Pregnancy
Author
Hyderabad, First Published Oct 22, 2019, 2:07 PM IST

గర్భిణీ స్త్రీలను ఎక్కువగా పండ్లు తినమని డాక్టర్లు, ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. పండ్లలో పోషకాలు ఎక్కవగా ఉంటాయి కాబట్టి.. వాటిని తీసుకుంటే.. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం. అయితే..చాలా మంది ఇళ్లల్లో పెద్దవాళ్లు అరటి పండు తినమని ఎక్కువగా చెబుతుంటారు. ఎందుకంటే అలా అరటి పండు తింటే.. మగపిల్లాడు పుడతారని వారి నమ్మకం.

అదేంటి? అరటిపండు తింటే అబ్బాయి లేకపోతే అమ్మాయి పుడుతుందా? అసలు ఇది ఎలా సాధ్యం? అదంతా తూచ్ అని చాలా మంది కొట్టిపారేయచ్చు. అయితే.. అది నిజమేనని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. చాలా మంది గర్భిణీలపై జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 

అరటిపండులో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు హార్మోన్ల స్థితి మారడానికి దోహదం చేస్తాయి. ఇలా మారడం అనేది అబ్బాయి పుట్టడానికి దోహదం అవుతుందన్న విషయం పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాకపోతే కేవలం అరటిపండు తినడం వలనే కచ్చితంగా అబ్బాయే పుడతాడా? అన్న విషయాన్ని మాత్రం వీరు నిర్ధారించలేకపోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios