Asianet News TeluguAsianet News Telugu

RTC strike: క్యాబ్ లను రోడ్ల మీదికి తెచ్చిన తమిళిసై, బిజెపి ట్రాప్ లో కేసీఆర్

ఆర్టీసీ సమ్మె సందర్బంగా తెలంగాణలోని క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు మద్దతుగా సమ్మెకు దిగుతామని ప్రకటించారు. కానీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారు వారితోని చర్చలు జరిపి వారిని సమ్మెబాట పట్టకుండా ఆపారు. ఇలా యాక్టీవ్ పొలిటీషియన్ గవర్నర్ గా ఉండడం, ఆమె యాక్టీవ్ గా వ్యవహరిస్తుండడం తో కెసిఆర్ బీజేపీ ట్రాప్ లో పడుతున్నారా అనే అనుమానం రాక మానదు. 

RTC strike: tamilisai intervenes, cab drivers call off strike...kcr in bjp's trap?
Author
Hyderabad, First Published Oct 21, 2019, 2:03 PM IST

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఇప్పుడప్పుడు సమసిపోయే విషయంగా కనపడడం లేదు. కార్మికులేమో తమ హక్కుల కోసం పోరాడుతుంటే, ఎలాగైనా తన పంతం నెగ్గించుకోవాలి ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుపట్టి కూర్చున్నారు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రకటించి సంచలనానికి తెర తీసిన కెసిఆర్, కోర్టు చర్చలకు వెళ్లాలని ఆదేశించినా అవి సూచనలు మాత్రమే అంటూ వాటిని బేఖాతరు చేసారు. 

మొన్న 19వ తారీఖు నాడు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన విషయం బంద్ విజయవంతమవడం మనం చూసాము. ఆ బంద్ కు అఖిల పక్షం మద్దతు ప్రకటించింది కూడా. వాస్తవానికి బంద్ కు కొన్ని రోజుల ముందు క్యాబ్ డ్రైవర్లు కూడా ఈ బంద్ కు మద్దతుగా, తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించింది. 

కేవలం ఓలా ,ఉబర్ క్యాబు డ్రైవర్లు మాత్రమే కాకుండా, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో తిరుగుతున్న క్యాబు డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు వారు ప్రకటించారు. దానితో ప్రజలంతా "బంద్ రోజు ఎలా రా బాబు?" అంటూ తలలు పట్టుకున్నారు. 

కేసీఆర్ కు దెబ్బమీద దెబ్బ: సమ్మెకు దిగుతున్న ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు...

కానీ విచిత్రంగా ఆ రోజు క్యాబులు తిరిగాయి. బంద్ రోజు కనీసం తిరగడానికి ఇవన్నా రోడ్లమీద ఉన్నాయి అని ఊపిరి పీల్చుకున్నారు తప్ప, అసలు వారు ఎందుకు సమ్మె బాట పట్టకుండా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు అని ఆలోచించలేదు. మరి ఇంతకూ వారు సమ్మె నిర్ణయాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నట్టు? 

ప్రభుత్వం చర్చలు జరిపిందా? ఆ ఛాన్సే లేదు. ప్రభుత్వ రంగ సంస్థయిన ఆర్టీసీ డ్రైవర్లతోని చర్చలు జరిపమని ఏకంగా కోర్టు చెప్పినా కూడా కెసిఆర్ సారు వినడం లేదు. అలంటి మన సారు ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ల సంఘం తోని చర్చలు జరుపుతారనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. 

మరి వారెందుకు సమ్మె విరమించినట్టు? కారణం వారితోని చర్చలు జరిపి వారిని సమ్మె బాట పట్టవద్దని ఒప్పించారు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ సమ్మె వల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడు క్యాబులు కూడా ఆగిపోతే ప్రజల ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయని వారిని ఒప్పించారు. 

చర్చలు ఎవరు జరిపారు? జరిపింది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారు. ఆమె స్వయంగా వారితోని చర్చలు జరిపి సమ్మె బాట పట్టకుండా ఒప్పించారు. ఇప్పటికే తమిళిసై సౌందర్ రాజన్ గారు తెలంగాణలో చాల యాక్టీవ్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై కెసిఆర్ ను కాదని రవాణా శాఖ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. 

విశ్వవిద్యాలయాల వైస్ చాన్సెలర్లతోని భేటీ అయ్యారు. రూసా కింద రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదని, వెంటనే రాష్ట్రప్రభుత్వం నుంచి ఆ నిధులను తెప్పించుకోవాలని వారిని ఆదేశించారు. 

అచ్చం కుముద్ బెన్ జోషీ లాగే తమిళిసై: కేసీఆర్ పక్కలో బల్లెం?

కొన్ని రోజుల కింద ప్రజా దర్బార్ రెగ్యులర్ గా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమిళిసై గారు మొన్నటివరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు. మొన్న 5నెలల కింద జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసారు కూడా. గవర్నర్ గా నియమింపబడే వరకు కూడా, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగారు. ప్రజలు ఇంకా ఆమెను పూర్తిగా బీజేపీ యాంగిల్ నుంచి చూస్తున్నారు తప్ప స్వతంత్రురాలైన పార్టీలకతీతంగా పనిచేస్తున్న గవర్నర్ గా ఆమెను చూడలేకపోతున్నారు. కారణం ఆమె ఆక్టివ్ పొలిటీషియన్ అవ్వడం. 

ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆక్టివ్ పొలిటీషియన్  తెలంగాణకు గవర్నర్ గా ఉండడం కెసిఆర్ కు ఖచ్చితంగా మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఆక్టివ్ పొలిటీషియన్ గవర్నర్ గా ఉంటే ఏమవుతుందో పుదుచ్చేరి విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ కిరణ్ బేడీ కాంగ్రెస్ సర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 

ఒకపక్కనేమో పరిపాలన జరిపే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరు. సచివాలయానికి రారు. అమెరికా ప్రసిడెంట్ ఎక్కిన ఏ విమానమైనా ఎయిర్ ఫోర్స్-వన్ అయినట్టు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అని అన్నారు. 

ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో గవర్నర్ గనుక మరింత యాక్టీవ్ గా  వ్యవహరించడం  మొదలుపెడితే, ప్రజలు ఖచ్చితంగా తమ సమస్యలను గవర్నర్ కు విన్నవించుకుంటారు. అది సోషల్ మీడియాలోనా నేరుగానా అనేది అప్రస్తుతం. కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను అనే మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళుతుంది. 

ఇప్పటికే బీజేపీ నాయకులు గవర్నర్ ని పలుమార్లు కలుస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. వారి అభ్యర్థనను స్వీకరించగానే ఆమె రంగంలోకి దిగారు. రవాణా శాఖా కార్యదర్శి పరిస్థితి వివరించడానికి వస్తే సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఎక్కడుందని అడిగారు కూడా!

కేసీఆర్ సెల్ఫ్ గోల్, గులాబీ ఓనర్లు గప్ చుప్: అశ్వత్థామ రెడ్డి వెనక...

 రెగ్యులర్ గా తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ తోని టచ్ లో  ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. క్యాబ్ డ్రైవర్లను గవర్నర్ వద్దకు తీసుకెళ్లింది కూడా బీజేపీ నాయకులేనట. ఆర్టీసీ కార్మికులు జాతీయ బీసీ కమిషన్ కు ఉద్యోగుల డిస్మిస్ పై ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. దీని వెనుక ఉన్నది కూడా బీజేపీ నేతలే.  

గవర్నర్ చెప్పినట్టు ప్రజాదుర్బార్ గనుక స్టార్ట్ చేస్తే, బీజేపీ నాయకులు ప్రజాసమస్యలపై పోరాటం పేరుతో ఉన్న అన్ని సమస్యలను ఎత్తుకొని ప్రజలను వెంటేసుకొని రెగ్యులర్ గా రాజ్ భవన్ చుట్టూ ట్రిప్పులు కొడతారు. ఉన్న పరిపాలకుడు అందుబాటులో లేనప్పుడు ప్రజలు ఇక్కడకు వస్తారు కూడా. ఈ పరిస్థితుల వల్ల బీజేపీ లాభం పొందుతుందా లేదా అనే విషయం కన్నా, కెసిఆర్ కు ఖచ్చితంగా నష్టం కలుగుతుందనేది మాత్రం వాస్తవం.  

Follow Us:
Download App:
  • android
  • ios