Asianet News TeluguAsianet News Telugu

యూట్యూబ్ ‘వంటల తాత’...ఇక లేరు

నారాయణ రెడ్డి “గ్రాండ్‌పా కిచెన్‌’” పేరుతో 2017 ఆగస్టులో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించారు. అక్టోబర్‌ 27న వంటల తాత చనిపోయినట్లు చెందినట్లు ఆయన అనుచరులు ఛానెల్‌లో తెలిపారు.

YouTube's Beloved Grandpa, Who Cooked For Orphans, Dies At 73
Author
Hyderabad, First Published Nov 4, 2019, 3:28 PM IST

యూట్యూబ్ లో వీడియోలు చేసి సంచలనం సృష్టించిన  వంటల తాత ఇక లేరు. యూట్యూబ్ లో ఎక్కువగా  వీడియోలు చూసేవారందరికీ.. ‘గ్రాండ్ పా కిచెన్’ గురించి ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది. ‘గ్రాండ్ పా కిచెన్’ పేరిట ఆయన రకరకాల రుచులను నెటిజన్లకు పరిచయం చేసేవారు.  ఆయన అసలు పేరు నారాయణ రెడ్డి.

YouTube's Beloved Grandpa, Who Cooked For Orphans, Dies At 73

ముద్ద పప్పు, పులిహోర, చింతకాయ తొక్కు, బిర్యానీ వంటి సంప్రదాయ వంటల నుంచి.. మంచూరియా, పిజ్జా, బర్గర్స్‌ లాంటి చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్‌ ఫుడ్‌ వరకు అన్నిటినీ అవలీలగా వండి వార్చేవారు నారాయణ రెడ్డి. ఆయన ఎలాంటి ఫుడ్ చేసినా కేవలం కట్టలపొయ్యి మీద మాత్రమే చేయడం ఆయన ప్రత్యేకత. 

ఈ రోజుల్లో ఓవెన్ లేకుండా కేసులు చేసేవాళ్లుఎవరైనా ఉన్నారా..? కానీ నారాయణ రెడ్డిమాత్రం నోరూరించే చాక్టెట్ కేకులు కూడా కేవలం కట్టలపొయ్యి మీదే చేసేసేవాడు.  చూసేవాళ్లకి ఈ రెసిపీ చేయడం ఇంత ఈజీనా అని అనిపించేలా చాలా సింపుల్ గా , రుచిగా వంటలు చేసేవాడు.

YouTube's Beloved Grandpa, Who Cooked For Orphans, Dies At 73

నారాయణ రెడ్డి “గ్రాండ్‌పా కిచెన్‌’” పేరుతో 2017 ఆగస్టులో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించారు. అక్టోబర్‌ 27న వంటల తాత చనిపోయినట్లు చెందినట్లు ఆయన అనుచరులు ఛానెల్‌లో తెలిపారు.

యూట్యూబ్‌లో గ్రాండ్‌ పా కిచెన్‌ అని ఒక ఛానెల్‌ను ప్రారంభించి కొద్దికాలంలోనే 6.11 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను పొందారు. ఒకేసారి పెద్ద మొత్తంలో వంటకాలు చేసి అనాథ పిల్లలకు ఆహారం పంపిణీ చేస్తుండేవారు. వాటికి సంబందించిన వీడియోస్ ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి తనకి వచ్చిన ఇంగ్లీషులో ఆయన వంటకాల తయారీని వివరిస్తూ ఉండేవారు. వంతల తాత నారాయణ రెడ్డి ప్రాంతీయ వంటకాలే కాకుండా విదేశీ వంటకాలు కూడా చేసి చూపించేవారు.

YouTube's Beloved Grandpa, Who Cooked For Orphans, Dies At 73

తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన డబ్బును నారాయణ రెడ్డి పేద పిల్లలకు పంచిపెట్టేవారు. ఆయన అసలు ఈ ఛానెల్ ప్రారంభించడానికి అసలు కారణమే.. పేదలు, అనాథలకు సహాయం చేయడం.

నారాయణ రెడ్డి చనిపోవడానికి ఆరు రోజుల ముందు కూడా వంటలు చేసి అందరికీ పంచిపెట్టడం విశేషం. తాను పోయినా..ఛానల్ మాత్రం ఆగడానికి వీలులేదని ఆయన తన సహచరులకు చెప్పినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios