Asianet News TeluguAsianet News Telugu

హెచ్1 బీ వీసాల్లో మోసం.. ముగ్గురు ఎన్ఆర్ఐలు అరెస్ట్

హెచ్1 బీ వీసాల్లో మోసానికి పాల్పడిన ముగ్గురు ఎన్ఆర్ఐలు కాలిఫోర్నియాలో అరెస్టు అయ్యారు. 

Three Indian-Origin Consultants Charged In H-1B Visa Fraud In California
Author
Hyderabad, First Published Apr 2, 2019, 12:06 PM IST


హెచ్1 బీ వీసాల్లో మోసానికి పాల్పడిన ముగ్గురు ఎన్ఆర్ఐలు కాలిఫోర్నియాలో అరెస్టు అయ్యారు. ఈ విషయాన్ని యూఎస్ అధికారులు తెలిపారు. ముగ్గురు నిందితులను ఇటీవల కాలిఫోర్నియా ఫెడర్ కోర్టులో హాజరు పరిచారు.

ఫెడరల్ కోర్టు ప్రాసిక్యూటర్ డేవిడ్ ఆండర్సన్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన కిశోర్ దత్తపురం, కుమార్ అశ్వపతి, సంతోష్ గిరిలు హెచ్1 బీ వీసా ప్రాసెసింగ్ లో మోసానికి పాల్పడ్డారు. లేని ఉద్యోగాలకు హెచ్1బీ వీసా దరఖాస్తు చేశారు. వీరికి కేసుకు సంబంధించి కోర్టులో వాదోపవాదనలు జరిగాయి.

ప్రస్తుతం నిందితులు ముగ్గురు బెయిల్ మీద బయటకు వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగం లేని చాలా మందికి ఫేక్ కంపెనీలు చూపించి.. చాలా మందికి ఫేక్ హెచ్1 బీ వీసాలను అందజేశారు. లేని కంపెనీలను, ఉద్యోగాలను ఉన్నట్లుగా చూపించి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios