Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో హెచ్-1 బి వీసాల కుంభకోణం....ఎన్నారై అరెస్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగులను నిలువరించేందుకు వీసా నిబంధనలను జారీని మరింత  కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హెచ్ 1 బి వీసాల జారీపై అధికారులు అనేక ఆంక్షలు విధించారు. ఇదే అదునుగా భావించిన ఓ ఎన్నారై వీసాల కుంభకోణానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. ఈ  ఘటన కాలిపోర్నియాలో చోటుచేసుకుంది. 

nri arrested on H1B visa fraud case
Author
California City, First Published Nov 3, 2018, 6:47 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగులను నిలువరించేందుకు వీసా నిబంధనలను జారీని మరింత  కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హెచ్ 1 బి వీసాల జారీపై అధికారులు అనేక ఆంక్షలు విధించారు. ఇదే అదునుగా భావించిన ఓ ఎన్నారై వీసాల కుంభకోణానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. ఈ  ఘటన కాలిపోర్నియాలో చోటుచేసుకుంది. 

కావూరు కిశోర్‌కుమార్ (46) అనే ఎన్నారై 2007 నుంచి అమెరికాలో కన్సల్టెన్సీ వ్యాపారం చేస్తుంటాడు. ఓ నాలుగు కంపనీల తరపున కన్సల్టెంట్ గా వ్యవహరిస్తూ వివిధ దేశాలకు చెందిన ఉద్యోగులను అమెరికాలో ఉద్యోగం పేరిట ఆకర్షించేవాడు.  

అయితే ఇటీవల హెచ్ 1 బి వీసాల జారీ నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. దీన్ని అదునుగా భావించిన కిశోర్ అభ్యర్థుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ వీసా నిబంధనలను అతిక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. తన కన్సల్టెన్సీ ద్వారా నకిలీ పత్రాలతో వీసాలు పొంది ఉద్యోగార్థులను అమెరికాకు రప్పించడం గురించి బైటపడటంతో కాలిపోర్నియాలో అతన్ని అరెస్ట్ చేశారు.   

 10 వీసా ఉల్లంఘనలకు, 10 మెయిల్ మోసాలకు కిశోర్ పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు.  దీంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు అమెరికా న్యాయశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios