Asianet News TeluguAsianet News Telugu

లండన్ వీధుల్లో మెగా బతుకమ్మ...చరిత్ర సృష్టించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఖండాంతరాలు దాటుతూ ఇంగ్లాండ్ చేరుకుంది. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో  లండన్ వీధుల్లో మెగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 2500 మంది బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు. ఇలా యూరోప్ లోనే  అతిపెద్ద  బతుకమ్మ వేడుకలు  నిర్వహించి చరిత్ర సృష్టించినట్లు నిర్వహకులు తెలిపారు. 

mega bathukamma celebrations in london
Author
London, First Published Oct 16, 2018, 5:25 PM IST

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఖండాంతరాలు దాటుతూ ఇంగ్లాండ్ చేరుకుంది. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో  లండన్ వీధుల్లో మెగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 2500 మంది బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు. ఇలా యూరోప్ లోనే  అతిపెద్ద  బతుకమ్మ వేడుకలు  నిర్వహించి చరిత్ర సృష్టించినట్లు నిర్వహకులు తెలిపారు. 

mega bathukamma celebrations in london

ఈ వేడుకల్లో లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట అమ్మవారి పూజ, షమీ పూజ నిర్వహించారు. అనంతరం తెలుగు ఆడపడుచులు బతుకమ్మ ఆడారు. మహిళలంతా కలిసి కోలాటం ఆడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడటం ఈ వేడుకలకు స్పెషల్ అట్రాక్షన్  గా నిలచింది. సాంప్రదాయక బతుకమ్మ ఆటనే ప్రోత్సహించి నూతన పోకడలు,డిజెలకు దూరంగా ఈ వేడుక జరిగింది.  

ఈ సందర్భంగా లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ... భారతీయ సాంప్రదాయాలు కాపాడలిసిన బాధ్యత ఎన్నారైలపైన ఉందన్నారు.  ఆరేళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు.

యూరోప్ లోనే  అతి పెద్ద బతుకమ్మ  నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికి తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ ధన్యవాదాలు తెలుపారు.ఆయన మాట్లాడుతూ.... 2010లో బతుకమ్మ వేడుకలను మొట్ట మొదటిసారిగా నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్  వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్ ను అభినందించారు.   2012  నాటికి బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించి,  బతుకమ్మ భావజాలాన్ని చాటుతూ ప్రతి తెలంగాణ బిడ్డ  బతుకమ్మ ఆటలో పాల్గొనే స్థాయికి చేరుకుందని అన్నారు.

ప్రధాన కార్యదర్శి   సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ...   గత ఏడాది  అతిపెద్ద బతుకమ్మ వేడుకను నిర్వహించామని...ఈ సారి మళ్లీ అంతకంటే పెద్దఎత్తున వేడుకలు నిర్వహించి చరిత్ర తిరగరాసిన ఘనత మహిళలదే అని అన్నారు. 

ఈ వేడుకల్లో మహిళా విభాగం సభ్యులు  మీనాక్షి అంతటి, వాణి అనసూరి ,శౌరి గౌడ్ ,సాయి లక్ష్మి ,మంజుల పిట్ల  ,జయశ్రీ , శ్రీవాణి మార్గ్ , సవిత జమ్మల ,దివ్య,అమృత ,సీతాలత ,నీరజ ,వీణ మ్యాన ,కారుణ్య ,ఉషారమాలు బతుకమ్మ నిర్వహణ లో కీలకం గ పని చేసి  విజయవంతం చేశారని వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్ తెలిపారు. అలాగే కోర్ కమిటీ సభ్యులు రంగు వెంకట్ , ప్రవీణ్ రెడ్డి ,నరేష్ మల్యాల , కార్యదర్శి పిట్ల భాస్కర్ , అడ్వైసరి సభ్యులు డా  శ్రీనివాస్ ,  మహేష్ జమ్ముల,వెంకట్ స్వామి , బాలకృష్ణ రెడ్డి , మహేష్ చాట్ల ,శేషు అల్లా , వర్మా , స్వామి ఆశా , అశోక్ మేడిశెట్టి , సాయి మార్గ్ ,వాసిరెడ్డి సతీష్ రాజు కొయ్యడలు ఈ వేడుకల విజయంతంగా నిర్వహించడానికి సహకరించినట్లు తెలిపారు.    

Follow Us:
Download App:
  • android
  • ios