Asianet News TeluguAsianet News Telugu

థాయిలాండ్ లో ఇండియన్ టెక్కీ మృతి... ఆఖరి చూపు కోసం..

 తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని సహాయం కోరారు. దీంతో ఆయన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
 

Indian Techie Dies In Thailand, Centre Offers Help In Bringing Back Body
Author
Hyderabad, First Published Oct 11, 2019, 7:55 AM IST

థాయిలాండ్ లో ఓ ఇండియన్ టెక్కీ కన్నుమూసింది.  మధ్యప్రదేశ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రగ్యా పలివాల్(29) థాయిలాండ్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో  మృతి చెందింది. కాగా... ప్రస్తుతం ఆమె మృతదేహం  థాయిలాండ్ లోని ఓ హాస్పిటల్ లో ఉంది. మృతురాలి కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే... వారికి అప్పగిస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  మధ్యప్రదేశ్ కి చెందిన ప్రగ్యా.. బెంగళూరులోని  హాంగ్ కాంగ్ బేస్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా... కంపెనీ వార్షిక సమావేశం కోసం ఆమె థాయిలాండ్ వెళ్లారు. కాగా.. అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె  ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఆమె చనిపోయిన వార్త ముందుగా ప్రగ్యా స్నేహితురాలికి తెలిసింది.

ఆమె వెంటనే ఈ సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు తెలియజేసింది. వార్త తెలుసుకున్న ప్రగ్యా కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  వెంటనే తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని సహాయం కోరారు. దీంతో ఆయన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

కాగా.. వెంటనే అధికారులు థాయిలాండ్ లోని భారత రాయబార కార్యాలయానికి ఈ సమాచారాన్ని చేరవేశారు. ఆమె మృతదేహాన్ని త్వరలోనే స్వస్థలానికి పంపిస్తామని చెప్పారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా... బాధిత కుటుంబానికి తమ వంతు సహాయం చేస్తామని ముఖ్యమంత్రి కమల్ ణాథ్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios