Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్.. హాట్ లైన్ తెరచిన ఎంబసీ

విద్యార్థి వీసా ముసుగులో వందల మంది విదేశీయులు అమెరికాలో అక్రమంగా నివసించేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించిన 8మంది దళారులను ఇక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. 

Indian embassy opens hotline for students detained by US authorities
Author
Hyderabad, First Published Feb 2, 2019, 12:41 PM IST

అమెరికాలో నకిలీ విద్యార్థి వీసా రాకెట్  భారత్ లో కలకలం రేపింది. విద్యార్థి వీసా పేరిట వందల మంది విదేశీయులు అమెరికాలో అక్రమంగా నివసించేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించిన 8మంది దళారులను ఇక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. 

నకిలీ వీసాలతో అక్రమంగా అమెరికాలో ఉంటున్న దాదాపు 130 మంది విద్యార్థులను అక్కడి అధికారులు అరెస్టు చేయగా.. వారిలో 129మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. కాగా.. అమెరికాలో అరెస్టు అయిన భారత విద్యార్థుల కోసం భారత ఎంబసీ 24గంటలపాటు పనిచేసే హాట్ లైన్ ని ఏర్పాటు చేసింది. 

విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు నిరంతరం అందుబాటులో ఉండేందుకు వీలుగా ఓ నోడల్ అధికారిని కూడా ఎంబసీ నియమించింది. టెక్సాస్ లోని డిటెన్షన్ సెంటర్ లో ఉన్న భారత విద్యార్థులను అక్కడి భారత కాన్సులేట్  అధికారులు కలిసి.. వారికి అన్నివిధాల సహకారం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో భాగంగా అధికారులు ప్రారంభించిన ఫార్మింగ్‌టన్‌ యూనివర్శిటీ నకిలీదని విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్ అటార్నీ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఫెడరల్‌ అధికారుల తీరును తప్పుబట్టారు.

మరిన్ని సంబంధిత వార్తలు

అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే

ఫేక్ యూనివర్సిటీ కలకలం: తెలుగువారి కోసం రంగంలోకి తానా

యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్: తెలుగువారిని ట్రాప్ చేశారిలా..?

Follow Us:
Download App:
  • android
  • ios