Asianet News TeluguAsianet News Telugu

అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే

అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తున్న వానిని గుర్తించడానికి ప్రభుత్వం నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. 2015లో ఏర్పాటైన  యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌లో హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషాల్లో ఉద్యోగులుగా చేరారు. 

immigration sting operation by Homeland Security agents
Author
United States, First Published Jan 31, 2019, 7:57 AM IST

అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తున్న వానిని గుర్తించడానికి ప్రభుత్వం నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. 2015లో ఏర్పాటైన  యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌లో హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషాల్లో ఉద్యోగులుగా చేరారు.

ఈ క్రమంలో విద్యార్థులకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వారిని ఇక్కడ నివసించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న పలువురిపై నిఘా పెట్టారు. ఈ ఆపరేషన్‌లో 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు లభించేందుకు సహకరించిన 8 మంది తెలుగువారిని గుర్తించారు.

దీంతో 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారంలో గురువారం ఉదయం 20 మంది తెలుగువారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. వీరంతా మాస్టర్స్ చేసి హెచ్1బీ కోసం వెయిట్ చేస్తున్నవారే.

అక్రమాలకు పాల్పడిన తెలుగువారు:
* భరత్ కాకిరెడ్డి , లేక్ మేరీ (ప్లోరిడా)
* అశ్వంత్ నూనె, అట్లాంటా
* సురేశ్ రెడ్డి కందాల, వర్జీనియా
* ఫణిదీప్ కర్నాటి, లూసివిల్లె, (కెంటుకీ)
* ప్రేమ్ కుమార్ రామ్‌పీసా, చార్లెట్, (నార్త్ అమెరికా)
* సంతోష్ రెడ్డి సామా, ఫ్రెమాంట్, (కాలిఫోర్నీయా)
* అవినాశ్ తక్కెళ్లపల్లి, హర్రీస్‌బర్గ్ (పెన్సుల్వేనియా)
* నవీన్ ప్రత్తిపాటి, డల్లాస్

Follow Us:
Download App:
  • android
  • ios