Asianet News TeluguAsianet News Telugu

సెంచ‌రీ కొట్టిన శిఖ‌ర్ ధావ‌న్‌

  • అద్బుత సెంచరీతో రాణించిన శిఖర్ ధావన్
  • రాణించిన మరో ఓపెనర్ లోకేష్ రాహుల్.
  • రెండు వికేట్లు కోల్పొయిన ఇండియా.
shikar dhawan century

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్లు భారీ స్కోర్ సాధించారు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ అద్బుత‌మైనా బ్యాటింగ్ తో ఇండియా స్కోర్‌ను ప‌రుగులు పెట్టించారు. ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ 123 బంతుల్లో 119 ప‌రుగులు చేశాడు. 

 భార‌త ఓపెన‌ర్లు శ్రీలంక‌లో ఒక నూత‌న రికార్డును నెల‌కొల్పారు. విదేశీ ఓపెన‌ర్లు లంకలో టెస్టు మ్యాచ్ల్లో అత్య‌ధిక స్కోర్ 118 మాత్రమే. కానీ భారత ఓపెనర్లు ఇప్పుడు 188 కి చేర్చారు. నాలుగేళ్లలో శ్రీలంకతో వంద అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రెండో ఓపెనింగ్ జోడీగా కూడా మరో ఘనతను సాధించారు.

మొద‌ట‌ బ్యాంటింగ్ ఎంచుకుని భార‌త్ తొలి సెషన్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భోజన విరామ సమయానికి భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 134 పరుగులు చేసింది. త‌రువాత బ్యాటింగ్ కి దిగిన ఓపెన‌ర్లు దాటిగా ఆడారు. శిఖ‌ర్ ధావ‌న్ 109 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. లోకేష్ రాహుల్ 85 ప‌రుగులు చేసి మ‌లిండా పుష్ప‌కుమారా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్ర‌స్తుతం ధావ‌న్ 119 ప‌రుగులక అవుట్ అయ్యాడు.ప్ర‌స్తుతం పుజారా 7 ప‌రుగుల‌తో, కోహ్లీ 1 ప‌రుగుతో బ్యాటింగ్ చెస్తున్నారు. ఇండియా 220 ప‌రుగుల‌కు రెండు వికెట్లు కొల్పోయింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios