Asianet News TeluguAsianet News Telugu

భారత్ విపణిలోకి అప్‌డేటెడ్ రెనాల్డ్ ‘క్విడ్’:రూ.2.83 లక్షల నుంచి షురూ!

భారతీయ మార్కెట్లో రెనాల్డ్ ఆవిష్కరించిన అప్ డేటెడ్ క్విడ్ కారులో పలు రకాల అధునాతన ఆప్షన్లు, ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.2.83 లక్షల నుంచి రూ.4.84 లక్షల మధ్య ఉంటుంది.

Renault unveils updated Kwid, price starts at Rs 2.83 lakh
Author
Hyderabad, First Published Oct 2, 2019, 3:42 PM IST

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి రెనాల్డ్ ఇండియా అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ‘క్విడ్‌’ కారును విడుదల చేసింది. ఈ కారు ధరలు రూ.2.83- 4.84 లక్షల మధ్య ఉన్నాయి. 0.8 లీటర్‌, 1.0 లీటర్‌ పవర్‌ట్రెయిన్స్‌, మాన్యువల్‌, ఆటోమేటెడ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో ఈ ఎంట్రీ లెవల్‌ కారును రెనాల్డ్ ఇండియా తీసుకువచ్చింది.

0.8 లీటర్‌ వేరియంట్‌ ధర రూ.2.83 లక్షలు, రూ.4.13 లక్షల మధ్యన ఉండగా 1.0 లీటర్‌ వేరియంట్‌ ధరలు రూ.4.33 లక్షలు, రూ.4.84 లక్షల మధ్యన ఉన్నాయి. సరికొత్త క్విడ్‌ను నెక్ట్స్‌ జెనరేషన్‌ టెక్నాలజీతో తీసుకొచ్చినట్లు రెనాల్ట్ ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్‌ మామిళ్లపల్లి చెప్పారు.

దేశీయ మార్కెట్లో రెనాల్డ్ ఇండియాకు క్విడ్ కీలకంగా ఉందని రెనాల్ట్ ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్‌ మామిళ్లపల్లి పేర్కొన్నారు. భారత మార్కెట్‌ అవసరాలకు తగినట్లు ప్యాసింజర్‌ సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబీడీ)తో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), ఓవర్‌ స్పీడ్‌ అలర్ట్‌తో రూపొందించినట్లు రెనాల్ట్ తెలిపింది.

కొత్త క్విడ్‌లో రియర్‌ పార్కింగ్‌ సెన్సర్స్‌, రియర్‌ వ్యూ కెమెరా, స్పీడ్‌ సెన్సింగ్‌ ఆటో డోర్‌ లాక్‌ వంటి ఫీచర్లను పొందుపరిచినట్లు వెల్లడించింది. ఇదే మోడల్‌లో క్లైంబర్ ఆప్షన్ కారు మాత్రం టాప్ వేరియంట్‌లోనే లభిస్తుంది. సరికొత్తగా జెన్సకర్ బ్లూతోపాటు ఐదు సరికొత్త రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంటుంది.

ఈ కారు డీఎన్ఎలోనే స్రుజనాత్మక ఉన్నదని, ఎస్ యూవీని తలపించే క్విడ్ రెనాల్డ్ భారత్ తీరునే మార్చేసిందని మామిళ్లపల్లి వెంకట్రామ్ చెప్పారు. కొత్త క్విడ్ మోడల్ కారులో స్లీక్, స్టైల్, ఫీచర్లు, టెక్నాలజీ కలిసి ఉన్నాయన్నారు.

గ్రిల్, అడ్డంగా ఉన్న డేటైం లైట్లు, ఆరెంజ్ హైలెట్స్ వంటి ఫీచర్లు కారు అందాన్ని మరింత పెంచాయి. క్లైంబర్ వేరియంట్ కారులో 14 అంగుళాల సరికొత్త వాల్కినో గ్రే మల్టీ స్టోక్ వీల్స్ అమర్చారు. ఈ కారుకు 184 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. గతంలోకంటే 4ఎంఎం ఎక్కువ. సరికొత్త టెయిల్ ల్యాంప్స్, సీ ఆకారంలోని ఎల్ఈడీ లైట్లు, సరికొత్త బంపర్‌తో కారు లుక్సే మారిపోయాయి.

కారులో డ్యుయల్ టోన్ డ్యాష్ బోర్డు, క్రోమ్ ఇంటీరియర్ అమర్చారు. లెదర్ రాప్డ్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. దీంతోపాటు 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలతో పని చేస్తుంది. వీడియో ప్లే బ్యాక్, వాయిస్ రికగ్నైజేసన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 279 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీన్ని 620 లీటర్ల వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios