Asianet News TeluguAsianet News Telugu

రెడ్ మీ నోట్5 వచ్చేసింది.. బడ్జెట్ ధరలోనే

  • భారత మార్కెట్లోకి షియోమి నుంచి రెండు ఫోన్లు
  • బడ్జెట్ ధరలో అందిస్తున్న షియోమి
Redmi Note 5 Redmi Note 5 Pro Launched in India at Starting Price of Rs 9999

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లో రెండు స్మార్ట్ ఫోన్లు ప్రవేశపెట్టింది. షియోమి రెడ్ మీ 4 భారత్ లో ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడుదల చేసిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కాగా.. ఇప్పుడు దానికి అదనపు ఫీచర్లతో రెడ్ మీ నోట్ 5 ఫోన్ ని కంపెనీ విడుదల చేసింది. దీనితోపాటు రెడ్ మీ నోట్ 5 ప్రో కూడా విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈ వెంట్ లో వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

రెడ్ మీ నోట్ 5 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999గా ప్రకటించింది. 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం గల రెడ్ మీ నోట్5 ఫోన్ ధర రూ.9,999గా,  4జీబీ ర్యామ్‌ + 64జీబీ స్టోరేజ్‌ సామర్థ్యంగల ఫోన్ ధర రూ. 11,999గా ప్రకటించారు. నాలుగు రంగుల్లో రెడ్‌మి నోట్‌ 5 అందుబాటులోకి వచ్చింది.

షియోమి విడుదల చేసిన మరో స్మార్ట్‌ఫో న్‌ రెడ్‌మి నోట్‌ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి నోట్‌ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఇదే కావడం విశేషం.  4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌+64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో దీన్ని లాంచ్‌ చేసింది. వీటి ధరలు రూ.13,999గా, రూ.16,999గా ఉన్నాయి. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్ కూడా ఇందులో ఉంది. 20 మెగాపిక్సెల్‌తో సెల్ఫీ షూటర్‌ కలిగి ఉండగా.. వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను వచ్చే వారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌లలో ఫ్లాష్‌ సేల్‌కు రానున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆఫ్‌లైన్‌గా కూడా వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. 

రెడ్ మీ నోట్ 5 ఫీచర్లు...

5.99 ఇంచెస్ డిస్ ప్లే

2గిగా హెడ్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

1080*2160 పిక్సెల్స్ రెసల్యూషన్

3జీబీ ర్యామ్

32జీబీ స్టోరేజీ

ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్

12 మెగా పిక్సెల్ వెనుక కెమేరా

5 మెగా పిక్సెల్ ముందు కెమేరా

4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

Follow Us:
Download App:
  • android
  • ios