Asianet News TeluguAsianet News Telugu

అధికారం కోసం రాజకీయం చేయరట...

  • ‘‘అధికారం కోసం రాజకీయాలు చేయను’’...తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య.
  • చంద్రబాబు మాటలు విన్న తర్వాత ఎప్పుడెలా మాట్లాడుతారో ఆయనకే అర్ధం కావటం లేదని అనుకుంటే అది జనాల తప్పెంతమాత్రం కాదు.
  • ఎందుకంటే, మొన్నటి వరకూ టిడిపిదే శాశ్వత అధికారం అన్నది కూడా చంద్రబాబే.
Naidu says politics is not for power

‘‘అధికారం కోసం రాజకీయాలు చేయను’’...తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. చంద్రబాబు మాటలు విన్న తర్వాత ఎప్పుడెలా మాట్లాడుతారో ఆయనకే అర్ధం కావటం లేదని అనుకుంటే అది జనాల తప్పెంతమాత్రం కాదు. ఎందుకంటే, మొన్నటి వరకూ టిడిపిదే శాశ్వత అధికారం అన్నది కూడా చంద్రబాబే. అంతెందుకు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2019లో మాత్రమే కాదు 2029 వరకూ తానే అధికారంలో ఉంటానని స్పష్టంగా ప్రకటించారు. నంద్యాల, కాకినాడలో గెలవటానికి ఎంతకి దిగజారిందో అందరూ చూసిందే. మళ్ళీ అధికారం కోసం రాజకీయాలు చేయనని చెబుతున్నదీ చంద్రబాబే. ప్రెస్ మీట్ కు హాజరైన మీడియావారికే కాదు జనాలకు కూడా చంద్రబాబు మాటలు అర్ధం కావటం లేదు. సదావర్తి భూముల వేలంపాట ఎంతటి సంచలనం కలిగించిందో అదరికీ తెలిసిందే. అటువంటిది, సదావర్తి భూముల వేలం గురించి తనకేం తెలియదని చద్రబాబు అంటున్నారు. భూముల వేలంలో ధరలు ఒక్కసారిగా పెరగటంపై సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబు దృష్టికి రాలేదట. ఏం చేస్తాం చెప్పేది చంద్రబాబు కాబట్టి మనం వినాల్సిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios