Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు మీద దుర్గమ్మకు ఫిర్యాదు చేసిన కృష్ణ మాదిగ

మాదిగ రిజర్వేషన్ పోరాట నాయకుడు మంద కృష్ణ మాదిగ కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు మద్దతు తెలిపారు.తెలుగుదేశం పార్టీకి వోటేసి గెలిపించిన మాదిగలను, కాపులను చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేస్తుండటంపై ఆయన ఈ రోజు   విజయవాడలోని కనకదుర్గమ్మకు ఫిర్యాదు చేశారు.ముఖ్యమంత్రి సద్బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు

Krishna madiga performs puja at vijayawada Durga temple

 

 

మాదిగ రిజర్వేషన్ పోరాట నాయకుడు మంద కృష్ణ మాదిగ కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు మద్దు తెలిపారు.

తెలుగుదేశం పార్టీకి వోటేసి గెలిపించిన మాదిగలను, కాపులను చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేస్తున్నవిషయాన్ని ఆయన ఈ రోజు  తాత్కాలిక రాజధాని అయిన విజయవాడలోని కనకదుర్గమ్మకు ఫిర్యాదు చేశారు.

కృష్ణ మాదిగ ఈ రోజు ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకుని తమ  సమస్యలను నివేదించారు.

ఈ సందర్భంగా విలేకరులతో  మాట్లాడుతూ కాపుల కోసం కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడకు ఆయన మద్దుతు తెలిపారు.

చంద్రబాబుకు ఓట్లు వేసింది కాపులు..దళితులే

కాపుల ఓట్లతో గెలిచిన చంద్రబాబు ముద్రగడ్డ పాదయాత్రకు ఎందుకు అనుమతినివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

‘‘కమ్మ  ఓట్ల  తర్వాత టిడిపికి  ఎక్కువ  ఓట్లు  వేసింది మాదిగలు  కాపులు మాత్రమే.  అందువల్ల   ముద్రగడ  పాదయాత్రను  అనుమతించాలి.  బాబు చేసే పాదయాత్ర కు అనుమతిచ్చినప్పుడు  మా పాదయాత్రలకు  అనుమతి ఇవ్వరు. అనుమతి  ఇవ్వాలి,’’ అనిఅన్నారు.

ఇలాంటి   బాబు బుద్ధి  మారాలని తాను ఈ రోజు   అమ్మవారిని  దర్శించుకున్నానని కూడ ఆయన చెప్పారు.

 

కాపులకు లాగానే మాదిగలకు కూడా చంద్రబాబు అన్యాయంచేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

 

‘మాదిగలకు పెద్దకొడుకుగా ఉంటానని  మాదిగలకుకు ఇచ్చిన హామీలను చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ దుర్గమ్మకు ఫిర్యాదు చేశా. మాదిగలకు మూడేళ్ళలో ఏం చేశారో దుర్గమ్మకు సంజాయిషీ ఇవ్వాలి,’ అని కృష్ణ మాదిగ అన్నారు.

మంద కృష్ణమాదిగ ఇంకా చెప్పారంటే...

చంద్రబాబుకు చెడుబుద్దులు తొలగించి మంచి బుద్దులు ప్రసాదీంచాలని అమ్మవారిని వేడుకున్నా

చంద్రబాబుకు అండగా నిలించింది ఎమ్మార్పీఎస్ నేతలు..కాని ఈరొజు మాదిగల ఉద్యమాన్నే అణచివేయడం సిగ్గు చేటు 

పోలీసుల నిఘా మద్య తిరగాల్సిన పరిస్ధితి దాపురించింది 

వర్గీకరణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని జిల్లాల్లో పర్యటిస్తుంటే అక్రమ అరెస్ట్ లకు పాల్పడడం చంద్రబాబు దిగజారుడు తనానిని నిదర్శనం  

23 ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నాం...శాంతియుతంగా నిరసన తరలుపుతుంటే మీటింగ్ లకు పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణం 
చంద్రబాబుకు ఓడించిన వారికేమో పదవులిచ్చి ప్రోత్సహిస్తున్నారు..గెలిపించిన‌వారిని విస్మరిస్తారా

చంద్రబాబు విక్రుత చర్యలకు నిరసనగా ‌దేవాలయాల పేరుతో పర్యటిస్తున్నా

దేవాలయాల యాత్ర కు వెళుతున్నా పొలిసులు నిఘా 

ఎపి లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా‌ వ్యవహరిస్తూ ప్రజా‌స్వామ్యాన్ని మంటగలుపుతున్నారు 

జూలై 12 నుంచి ప్రారంభమయ్యే‌పార్లమెంట్ ఎస్సీ వర్గీకరణ బిల్లు  సమావేశాల్లో బి్ల్లు పెట్టాలని అమ్మవారిని వేడుకున్నా

జూలై 7 న అమరావతి లో కురుక్షేత్ర సభకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు స్రుష్టించినా నిర్వహించి తీరుతాం

Follow Us:
Download App:
  • android
  • ios