రూ.5వేలకన్నా తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్
- బడ్జెట్ ధరలో ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఇంటెక్స్.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. చైనా కి చెందిన షియోమి కంపెనీ ప్రేమికుల రోజున రెడ్ మీ 5 విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఫోన్ కి పోటీగా ఇంటెక్స్ ఫోన్ విడుదల చేసింది. ‘ ఆక్వా లయన్స్ టి1 లైట్ ’ పేరిట ఈ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ.4,449గా కంపెనీ ప్రకటించింది.
ఇంటెక్స్ ఆక్వా లయన్స్ టి1 లైట్ ఫోన్ ఫీచర్లు..
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1 జీబీ ర్యామ్,
8 జీబీ స్టోరేజ్,
64 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 7.0 నూగట్,
5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
2200 ఎంఏహెచ్ బ్యాటరీ.