Asianet News TeluguAsianet News Telugu

సెర్చింజన్‌తో ఎందుకు.. ఓన్ యాప్స్ ఉన్నాయిగా: హువావే

చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ హువావే సెర్చింజన్ గూగుల్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవల విడుదల చేసిన మేట్ 30 వేరియంట్ ఫోన్‌లో బూట్‌ లోడర్‌ని పూర్తిగా లాక్‌ చేసి పారేసింది. అవసరమైన వారు హువావే బూట్ లాక్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లొచ్చు.

Huawei Mate 30 phones launch without Google apps
Author
Hyderabad, First Published Sep 25, 2019, 11:23 AM IST

న్యూఢిల్లీ: మన జీవితాల్లోకి మరీ ఎక్కువగా తొంగిచూస్తోందంటూ మనం అప్పుడప్పుడు విమర్శలతో విరుచుకుపడుతున్నా- దాని నుంచి తప్పించుకుని జీవించడం దాదాపు అసాధ్యం అన్న స్థితికి వచ్చేశాం. ఎందుకంటే గూగుల్‌ సర్వీసులు మన నిత్య జీవితంతో అంతగా మమేకం అయిపోయాయి.

గూగుల్ సర్వీసులను వినియోగించుకోవడం మనకు పూర్తిగా అలవాటు అయిపోవడమే కాదు మనం వాటి మీద పూర్తిగా ఆధారపడిపోయాం. అయితే చైనా మాత్రం అలా లేదు. గూగుల్ సర్వీసులకు అతీతంగా ఒక సమాంతర నెట్‌వర్క్‌ని ఏర్పరచుకోగలిగిన దమ్ము చైనా సంపాదించుకుంది.

జనబలం వల్ల అయితేనేం, టెక్నాలజీ బలం వల్ల అయితేనేం, ఇది చైనాకు సాధ్యమైంది. ఇందుకు తాజా ఉదాహరణగా హ్యూవావే మేట్‌ 30 ఫోన్‌ ఆవిష్కరణ. హ్యువావే ఫోన్ మోడల్‌లో బూట్‌ లోడర్‌ని పూర్తిగా లాక్‌ చేసి పారేసింది.

బూట్‌ లాకర్‌ అంటే టెక్నికల్‌ పీపుల్‌కి చాలామందికి తెలిసిందే. సాధారణంగా చైనా నుంచి వచ్చే ఫోన్స్‌లో గూగుల్ సర్వీసెస్ డిఫాల్ట్ గా ఉండవు. గూగుల్ ప్లే సర్వీసెస్ కానీ గూగుల్ సంబంధించిన క్రోమ్ బ్రౌజర్ గానీ, జీమెయిల్‌, మ్యాప్స్‌ లాంటి ఇతర గూగుల్ సర్వీసెస్ గానీ డిఫాల్ట్‌‌గా లేనప్పుడు - వాటిని అత్యవసరంగా జనం వాటిని భావిస్తారు.

కాబట్టి - ప్రపంచ మార్కెట్లో ఆ ఫోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ బూట్ లోడర్ ని అన్ లాక్ చేసుకుని గూగుల్ ప్లే సర్వీసెస్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం జరుగుతుంది. ఈ మేట్‌ 30 ఫోన్‌లో బూట్‌లాకర్‌ని హువావే పూర్తిగా, శాశ్వతంగా లాక్ చేసి పారేయడంతో, సెర్చింజన్ గూగుల్‌ను తీసి పక్కన పెట్టినట్లైంది.

గూగుల్‌ ని కాదని ఫోన్లని మార్కెట్‌ చేసుకోవడం అంటే- అది సామాన్యం కాదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో! కనీసం కొన్ని ఫోన్స్‌నైనా గూగుల్‌ - ఫ్రీగా మార్చగలగడం గొప్ప విజయమే అని చెప్పాలి. గూగుల్ లేకుండా హ్యువావే సమాంతర సర్వీసుల్నిఅందిస్తుంది సరే. చైనాలో అందించడమే కాదు... ఆ ప్రత్యామ్నాయాల్ని చైనాయేతర ప్రపంచానికి కూడా ఆధారపడేలా చేయగలిగితే మంచిది!

Follow Us:
Download App:
  • android
  • ios