Asianet News TeluguAsianet News Telugu

చిక్కుల్లో మరో టీం ఇండియా క్రికెటర్

  • చిక్కుల్లో పడ్డ హార్థిక్ పాండ్య
  • అంబేద్కర్ పై వివాదాస్పద ట్వీట్ చేసిన పాండ్య
Hardik Pandya to be booked for Ambedkar tweet

మరో టీం ఇండియా క్రికెటర్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే.. క్రికెటర్ షమీపై అతని భార్య పలు ఆరోపణలు చేసి.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై కేసు నమోదు చేయాలని ఏకంగా జోధ్ పూర్ న్యాయస్థానమే పోలీసులను ఆదేశించింది.

అసలు సంగతి ఏంటంటే.. హార్దిక్‌పాండ్యా తన ట్విటర్‌ అకౌంట్‌లోభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ  రాజస్తాన్‌ రాష్ట్రం జాలోర్‌లోని రాష్ట్రీయ భీం సేన సభ్యుడు, న్యాయవాది డీఆర్‌ మొఘవాల్‌ కేసు నమోదు చేయాల్సిందిగా లూనీ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించారు. అక్కడ పోలీసు అధికారులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో మొఘవాల్‌ కోర్టును ఆశ్రయించారు.

ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారించి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ అంబేద్కర్‌ ? దేశంలో రిజర్వేషన్‌ అనే వ్యాధిని వ్యాప్తి చేసిన వారేనా? ’ అని ట్విటర్‌లో హార్దిక్‌పాండ్యా పోస్టు చేయడంతో ఈ వివాదం తలెత్తింది. ఇటీవలే హార్డిక్‌ పాండ్యాను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ రూ.11 కోట్లకు దక్కించుకున్న సంగతి తెల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios