Asianet News TeluguAsianet News Telugu

నలుగురికి గుండెలను మార్చేసారు

మామూలుగా గుండెకు స్టంట్ వేయాలంటేనే ప్రస్తుతం ఎంత ఖర్చవుతుందో అందరకీ తెలిసిందే. అటువంటిది ఏకంగా గుండెనే మర్చాలంటే అదికూడా కార్పొరేట్ ఆసుపత్రిలో అంటే ఇక ఖర్చుగురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

Doctors conducted four heart transplantation surgeries successfully

హైదరాబాద్ లోని గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పటల్ డాక్టర్లు ఒకే నెలలో నాలుగు గుండెమార్పిడి ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఇంత తక్కువ వ్యవధిలో నాలుగు గుండెమార్పిడి ఆపరేషన్లు చేసిన చరిత్ర లేదు. నలుగురు రోగులు కూడా నిరుపేదలే. మామూలుగా గుండె ఆపరేషన్ కు స్టంట్ వేయాలంటేనే ప్రస్తుతం ఎంత ఖర్చవుతుందో అందరికీ తెలిసిందే. అటువంటిది ఏకంగా గుండెనే మర్చాలంటే అదికూడా కార్పొరేట్ ఆసుపత్రిలో అంటే ఇక ఖర్చుగురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అటువంటిది నలుగురు నిరుపేద కుటుంబాల్లోని రోగులకు గుండెమార్పిడి ఆపరేషన్ ఉచితంగా, విజయవంతంగా జరిగింది.  వీటికయ్యే ఖర్చును  ఆరోగ్య శ్రీ పథకం కింద తెలంగాణ  ప్రభుత్వం అందించింది.

 

కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుండెమార్పిడిని కూడా  ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చటంతో  ఇపుడు ఈ అపరేషన్లు సాధ్యమయ్యాయి.

 

ఈ రోజు హాస్పిటల్లోని రోగులను తెలంగాణా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఈరోజు పరామర్శించారు. ఆపరేషన్లు చేసిన వైద్యులను మంత్రి అభినందిస్తూనే భవిష్యత్తులో నిరుపేదల సేవలో కార్పొరేట్ ఆసుపత్రులు మరింత భాగస్వాములు కావాలని కోరారు.

 

తెలంగాణ‌లో జూన్ 2016 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురికి హార్ట్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ స‌ర్జ‌రీలు జ‌రుగ‌గా, మ‌రో ఎనిమిది మందికి లివ‌ర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ స‌ర్జ‌రీలు జ‌రిగాయ‌ని మంత్రి వివ‌రించారు. వీరంద‌రి ఆరోగ్య ప‌రిస్థితి బాగుంద‌ని బాగా కోలుకుని త‌మ ప‌నుల చేసుకోగులుగుతున్నార‌ని, ఇది ఎంతో సంతోష‌దాయ‌క‌మ‌న్నారు. హార్ట్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ స‌ర్జ‌రీలు ఇప్ప‌టి వ‌ర‌కు 6 జ‌రిగితే... వాటిల్లో సెంచ‌రీ హాస్పిట‌ల్ లో ఒక‌టి, నిమ్స్ లో ఒక‌టి, గ్లోబ‌ల్ లో నాలుగు జ‌రిగాయ‌ని తెలిపారు. ఇక లివ‌ర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ లో ఉస్మానియా హాస్పిట‌ల్ లో మూడు, నిమ్స్ లో రెండు, గ్లోబ‌ల్ ఒక‌టి, యశోద‌లో రెండు, కిమ్స్ లో రెండు జ‌రిగాయ‌న్నారు మంత్రి. అయితే ఆరోగ్య శ్రీ కింద ఇచ్చే ప్యాకేజీలోనే ప్రైవేట్ హాస్పిట‌ల్స్ ఈ అవ‌య‌వ మార్పిడులు చేయ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ విష‌యంగా మంత్రి కొనియాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios