Asianet News TeluguAsianet News Telugu

ధర రూ.8000 ల్లోపు.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!!

బడ్జెట్ ధరకే పలు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి రూ.8000 ధరకే అద్భుతమైన ఫీచర్లతో రియల్ మీ సీ2, రెడ్ మీ 7, నోకియా 3 ప్లస్, యాసెస్​ జెన్​ఫోన్​ మ్యాక్స్​ ప్రో ఎం1, ఇన్ఫినిక్స్ ఎస్​4 ఫోన్లు లభ్యం కానున్నాయి.

Best smartphones under Rs 8,000: From Redmi 7, Realme C2 and more
Author
Hyderabad, First Published Oct 15, 2019, 11:58 AM IST

న్యూఢిల్లీ: తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేయాలని వినియోగాదారులు భావిస్తారు. ఇందుకోసం విపణిలో ఎన్నో ఫోన్లను చూసి అందులో తమ బడ్జెట్​లో ఉండే ఉత్తమ ఫోన్‌ను ఎంచుకుంటారు.

రూ.8వేల లోపు ఎక్కువ ఫీచర్లు గల మొబైల్​ కొనాలని చూస్తున్నారా? మరోవైపు ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజాలు వినియోగదారులకు దగ్గర అయ్యేందుకు పలు రకాల ఆఫర్లు తెచ్చాయి. రూ.8 వేల లోపు బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్నారా? బడ్జెట్​లో రూ.8,000 లోపు మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్​ఫోన్ల గురించి ఒక్కసారి తెలుసుకుందాం

బెస్ట్ ఫోన్ రియల్ మీ 3ఐ రియల్​మీ 3ఐ మోడల్ ఫోన్ రూ.8,000 లోపు ధర ఉన్న బెస్ట్ ఫోన్‌గా నిలిచింది. 6.2 అంగుళాల డ్యూడ్రాప్​ ఫుల్​స్క్రీన్​తో ఈ మోడల్​ను తెచ్చింది రియల్​మీ. ఇందులో 4230 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీని పొందుపరిచారు. హీలియో పీ60 చిప్​సెట్​తో ఈ ఫోన్​ పని చేస్తుంది. 13 ఎంపీ, 2 ఎంపీ సామర్థ్యం గల 2 వెనుక కెమెరాలు ఉన్న రియల్​మీ 3ఐ మోడల్​.. 3 జీబీ ర్యామ్​-32 జీబీ రామ్​, 4 జీబీ ర్యామ్-64 జీబీ రామ్​ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో 3 జీబీ ర్యామ్ ఫోన్​ ధర మాత్రమే రూ.8000 లోపు ఉంది.

మూడు బ్యాక్ కెమెరాలతో ఇన్ఫినిక్స్ ఎస్​4 ఇలా మూడు వెనుక కెమెరాలు (13 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ )తో రూ.10 వేల లోపు అందుబాటులో ఉన్న అతి తక్కువ ఫోన్లలో ఇన్ఫినిక్స్ ఎస్​4 ఒకటి. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతోపాటు ఈ ఫోన్​ కెమెరా క్వాలిటీ హైలెట్​గా నిలుస్తోంది. ఇన్ఫినిక్స్​ ఎస్​4 మోడల్ ఫోన్​ చూడటానికి అందంగా ఉంటుంది. ప్రత్యేకించి నీలిరంగులోని ఫోన్​ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో ఇన్సినిక్స్ ఎస్4 ఇన్ఫినిక్స్​ ఎస్​4 మోడల్​లో మీడియాటెక్​ హీలియో పీ22 ప్రాసెసర్​ను పొందుపరిచారు. 6.21 అంగుళాల పూర్తి హెచ్​డీతో 3 జీబీ ర్యామ్ విత్ 32 జీబీ రామ్​​​, 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ రామ్​ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. 4,000 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీని ఈ ఫోన్​లో పొందుపరిచారు. అయితే ఇందులో 3 జీబీ ర్యామ్​ ఉన్న ఫోన్​ మాత్రమే రూ.8 వేల లోపు అందుబాటులో ఉంది.

యాసెస్​ జెన్​ఫోన్​ మ్యాక్స్​ ప్రో ఎం1 రూ.8 వేల లోపు ధర జాబితాలో అత్యంత పాత మొబైల్ ఫోన్​ యాసెస్​ జెన్​ఫోన్​ మ్యాక్స్​ ప్రో ఎం1. అయినా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లున్న స్మార్ట్​ఫోన్​ కొనాలనే వారికి ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. ఇప్పటి వరకు యాసెస్​ ఫోన్లకు గల సాఫ్ట్​వేర్ అప్​డేట్​ సమస్యనూ ఈ మోడల్​లో​ అధిగమించారు​. అందుకే ఇకపై ఈ ఫోన్​ కొనేవారు ఆండ్రాయిడ్​ 9-పై సేవలు పొందనున్నారు.

యాసెస్​ జెన్​ఫోన్​ మ్యాక్స్​ ప్రో ఎం1 ఫోన్‌లో ఆండ్రాయిడ్​ 10 అప్​డేట్​ అవుతుంది. మ్యాక్స్​ ప్రో మోడల్​ ఫోన్​ కెమెరాతో తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన ఫోటోలు తీసుకోవచ్చు. 3 జీబీ ర్యామ్​ విత్ 32 జీబీ రామ్​, 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ రామ్​ వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో 3 జీబీ ర్యామ్ ఫోన్​ను​ మాత్రమే రూ.8000 లోపు లభిస్తోంది.

రెడ్ మీ 7ఏలో ఉత్తమ ఫీచర్లు ఇలా ఇక రియల్​మి, ఇన్ఫినిక్స్​, యాసెస్​తో పాటు రెడ్​మీ 7ఏ కూడా తక్కువ ధరకే ఉత్తమ ఫీచర్లు అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే పై మూడు ఫోన్లపై ఆసక్తి చూపని వారు రెడ్​మీ 7ఏ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. బడ్జెట్​ ఫోన్​లో రెడ్​మీ 7ఏ జూలైలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది.

రెండు వేరియంట్లలో రెడ్ మీ 7ఏ 2జీబీ ర్యామ్​-32 జీబీ రామ్​, 3 జీబీ ర్యామ్-32 జీబీ రామ్​ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే ఇందులో 3 జీబీ ర్యామ్​ను కొనుగోలు చేస్తేనే మంచిదని వినియోగదారులు భావిస్తున్నారు. 5.45 అంగులాల డిస్​ప్లేతో ఫుల్​ హెచ్​డీలో ఈ ఫోన్​ అందుబాటులో ఉంది. 12 ఎంపీల వెనుక​ కెమెరా, 5 ఎంపీల సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్​లో పొందుపరిచారు.

తక్కువ వెలుతురులోనూ ఫోటో తీసే రియల్ మీ సీ2 బడ్జెట్ ధరలో ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి రియల్ మీ సీ2 ఫోన్ అత్యంత విజయవంతమైంది. 13 ఎంపీ, 2 ఎంపీ డ్యూయల్ రేర్ కెమెరాలు గల ఈ ఫోన్‌తో తక్కువ వెలుతురులోనే ఫొటోలు తీయొచ్చు. రియల్ మీ సీ 2 ఫోన్ 4000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. అమెజాన్‌లో రూ.7,989లకు ఈ ఫోన్ లభ్యం కానున్నది.

రూ.7999లకే శామ్‌సంగ్ గెలాక్సీ ఎం10 ఫోన్ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎం10 ఫోన్ లో 13 ఎంపీ, 5 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ డ్యూయల్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫోన్లు ఉన్నాయి. 3జీబీ ర్యామ్ విత్ 32 జీబీ వేరియంట్ అందుబాటులో ఉంది. అమెజాన్ ఈ-రిటైల్ లో ఈ ఫోన్ రూ.7,999లకే లభించనున్నది.

మరో ప్యాకెట్ ఫ్రెండ్లీ ఫోన్ అసుస్ జెన్ ఫోన్ మ్యాక్ ఎం2 అద్భుతమైన ఫీచర్లతో అసుస్ జెన్ ఫోన్ మ్యాక్ ఎం2 కూడా మరో ప్యాకెట్ ఫ్రెండ్లీ ఫోన్ కానున్నది. 3జీబీ ర్యామ్ విత్ 32 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో రూపొందించిన ఈ ఫోన్ రూ.6,999లకే లభ్యం కానున్నది. ఫ్లిప్ కార్ట్ సంస్థలో ఆన్ లైన్ లో లభించనున్నది. 6.26 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3ఎంపీ, 2 ఎంపీ డ్యూయల్ రేర్ కెమెరా, 8 ఎంపీల ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది. 4000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టాకోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది.

ఒకనాటి ఫేవరెట్ నోకియా 3.1 ప్లస్ రూ.8,147లకే ఒకనాడు ఇండియన్లకు ఫేవరెట్ ఫోన్‌గా ఉన్న నోకియా తాజాగా నోకియా 3.1 ప్లస్ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 13 ఎంపీ, 5ఎంపీ డ్యూయల్ కెమెరాతోపాటు 8ఎంపీ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ వీ8.0 ఓరియో అప్లికేషన్ పై ఆధారపడి పని చేస్తుంది. మీడియా టెక్ ఎంటీ 6762 ఆక్ట్రా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. అమెజాన్ లో దీని ధర రూ.8,147 మాత్రమే.

Follow Us:
Download App:
  • android
  • ios