Asianet News TeluguAsianet News Telugu

రూ.15 కోసం కక్కుర్తి పడితే.. రూ.20వేలు పెనాల్టీ పడింది

  • ఓ వ్యాపారి రూ.15 లాభం వస్తుందిలే అని చేసిన ఓ పని వల్ల అతనికి రూ.20వేలు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది.
  • జీఎస్టీ కిందకు వెళ్లాల్సిన నగదు తన ఖాతాలోకి వచ్చింది కదా అని సంబర పడిపోయాడు.
A shop owner in AP sold a shirt with out issuing Tax Invoice and get penality by tax department

గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లు అయ్యింది ఓ వ్యక్తి పరిస్థితి. ఓ వ్యాపారి రూ.15 లాభం వస్తుందిలే అని చేసిన ఓ పని వల్ల అతనికి రూ.20వేలు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని ఓ వ్యాపారి ఓ వ్యక్తికి రెడీమెడ్ టీషర్ట్ అమ్మాడు. దాని ధర రూ.300 కాగా.. జీఎస్టీ రూ.15( సీజీఎస్టీ-రూ.7.50, ఎస్ జీఎస్టీ- రూ.7.50) మొత్తం రూ.315. అయితే.. కస్టమర్ వద్ద నుంచి ఆ మొత్తాన్ని తీసుకొని బిల్లు రాయలేదు. తద్వారా జీఎస్టీ కిందకు వెళ్లాల్సిన నగదు తన ఖాతాలోకి వచ్చింది కదా అని సంబర పడిపోయాడు. కానీ అతని ఆనందరం ఆవిరవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు

A shop owner in AP sold a shirt with out issuing Tax Invoice and get penality by tax department

.

ఆదాయశాఖ అధికారులు కూడా అదే దుకాణంలో ఉన్నారు. వారి ముందే ఆ దుకాణదారుడు.. షర్ట్ అమ్మాడు. కానీ.. వారు అధికారులని ఆ దుకాణ యజమానికి తెలీదు. దీంతో బిల్లు రాయకుండా అమ్మకం జరిపాడు. దీనంతటినీ గమనించిన అధికారులు... అతనికి సీజీఎస్టీకి రూ.10వేలు, ఎస్ జీఎస్టీకి మరో రూ.10వేలు.. అంటే మొత్తం రూ.20వేల జరిమానా విధించారు. ఏపీ జీఎస్టీ చట్టం 2017- సెక్షన్ 31, సెక్షన్ 122 ప్రకారం ఈ జరిమానా విధించినట్లు అధికారులు వివరించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios