Asianet News TeluguAsianet News Telugu

ఆ నిబంధన మహిళలకు వర్తించదు: ముఖ్యమంత్రి

ఈ విధానం కింద వాహనాలను రోడ్లపైకి అనుమతించే విషయంలో మహిళలకు మినహాయింపు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. శనివారం నాడు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్నీ ప్రకటించారు. 

women exempted from odd even policy says kejriwal
Author
New Delhi, First Published Oct 12, 2019, 4:36 PM IST

న్యూఢిల్లీ: ఢిల్లీ లో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఇప్పటికే రెండు సార్లు విజయవంతంగా సరి- బేసి విధానాన్ని అమలు చేసిన కేజ్రీవాల్ సర్కార్ మరోమారు నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు ఈ స్కీం ను అమలుచేయనున్నట్టు తెలిపింది.

ఈ విధానం కింద వాహనాలను రోడ్లపైకి అనుమతించే విషయంలో మహిళలకు మినహాయింపు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. శనివారం నాడు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్నీ ప్రకటించారు. 

గత పర్యాయం ద్విచక్ర వాహనాలకు, సీఎన్జీ వాహనాలకు కూడా మినహాయింపు కల్పించారు. ఈ సారి మాత్రం ప్రైవేట్ సీఎన్జీ వాహనాలకు మినహాయింపు ఉండబోదని కేజ్రీవాల్ తెలిపారు. ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ఈ విషయంపై కూడా ఒక ప్రకటన చేయనున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. 

12రోజులపాటు అమలు చేయనున్న ఈ పద్దతిలో క్యాలెండరు లో సరిసంఖ్య తేదీల్లో సరి సంఖ్య రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన వాహనాలను, బేసి సంఖ్య తేదీల్లో బేసి రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ తెలిపారు. గత పర్యాయం కూడా నిబంధనలు ఉల్లంఘించినవారిపై 2,000 వరకు జరిమానా విధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios