Asianet News TeluguAsianet News Telugu

కులాంతర వివాహానికి శిక్ష: భర్తను భుజాలపై మోసిన మహిళ

కులాంతర వివాహాం చేసుకున్నందుకు ఓ మహిళకు విచిత్రమైన శిక్ష వేశారు. మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడినందుకు ఆమెకు శిక్ష విధించారు. ఆ శిక్షలో భాగంగా దాదాపు 20 ఏళ్ల వయస్సు గల మహిళ తన భుజాలపై భర్తను మోయాల్సి వచ్చింది.

Woman forced to carry husband on shoulders as punishment for marrying man of another caste
Author
Jhabua, First Published Apr 14, 2019, 8:57 AM IST

జబువా: కులాంతర వివాహాం చేసుకున్నందుకు ఓ మహిళకు విచిత్రమైన శిక్ష వేశారు. మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడినందుకు ఆమెకు శిక్ష విధించారు. ఆ శిక్షలో భాగంగా దాదాపు 20 ఏళ్ల వయస్సు గల మహిళ తన భుజాలపై భర్తను మోయాల్సి వచ్చింది.

ఆ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబువా జిల్లాలో భోపాల్ కు 340 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె చుట్టూ జనం చేరి భుజాలపై భర్తను మోస్తూ బలవంతంగా ఆమెను నడిపించిన దృశ్యం వీడియోలో రికార్డయింది.

అలసిపోయి ఆ మహిళ అగిపోతే గుంపు పెద్ద కేకలు వేస్తూ బలవంతంగా నడిపించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. జబువా జిల్లాలోని దేవగడ్ లో కొంత మంది మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని పోలీసు సూపరింటిండెంట్ (ఏస్పీ వినీత్ జైన్ చెప్పారు. కేసు మోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరింత మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios