Asianet News TeluguAsianet News Telugu

Ayodhya Verdict... అయోధ్య తీర్పు... ఈ రోజే ఎందుకు..?

ఏ పబ్లిక్ హాలీడే రోజు న్యాయస్థానం తీర్పు వెలువరించదు. ఆయన రిటైర్మెంట్ కి ఒకరోజు ముందు కూడా కోర్టు తీర్పు ఇవ్వడానికి అంగీకరించదు. కాబట్టి ఆరోజు కూడా తీర్పు ఇవ్వడానికి లేదు. ఆయన చివరి పని దినం... నవంబర్ 15. దీంతో... అయోధ్య కేసు తీర్పును నవంబర్ 14, 15వ తేదీల్లో ధర్మాసనం వెలువడించనుందని అందరూ భావించారు.

Why is Supreme Court delivering Ayodhya land dispute case verdict on Saturday?
Author
Hyderabad, First Published Nov 9, 2019, 8:21 AM IST

వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు ఉదయం  10గంటల 30 నిమిషాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేపథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. 

అయితే ఈ రోజే సుప్రీం కోర్టు అయోధ్య కేసు విషయంలో తీర్పు ఎందుకు వెలువరించనుందో ప్రత్యేక కారణం ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్... ఈనెల 17వ తేదీన రిటైర్ కానున్నారు. ఆయన రిటైర్మెంట్ లోపు ఈ  కేసు తుది తీర్పు ఇవ్వాలని అనుకున్నారు.  ఆయన రిటైర్మెంట్ రోజే తీర్పు ఇవ్వొచ్చు కదా అనే అనుమానం కొందరికి కలగొచ్చు.  ఆ రోజు ఆదివారం.

AlsoRead Ayodhya Verdict: ఐదుగురు జడ్జీలకు భద్రత పెంపు...

ఏ పబ్లిక్ హాలీడే రోజు న్యాయస్థానం తీర్పు వెలువరించదు. ఆయన రిటైర్మెంట్ కి ఒకరోజు ముందు కూడా కోర్టు తీర్పు ఇవ్వడానికి అంగీకరించదు. కాబట్టి ఆరోజు కూడా తీర్పు ఇవ్వడానికి లేదు. ఆయన చివరి పని దినం... నవంబర్ 15. దీంతో... అయోధ్య కేసు తీర్పును నవంబర్ 14, 15వ తేదీల్లో ధర్మాసనం వెలువడించనుందని అందరూ భావించారు.

సాధారణంగా, కోర్టు తీర్పును ప్రకటిస్తే, మరుసటి రోజు, వాది లేదా ప్రతివాదులలో ఒకరు నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించమని కోర్టును అభ్యర్థిస్తారు మరియు ఈ ప్రక్రియ సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 14, నవంబర్ 15 తేదీలను తీర్పు చెప్పేందుకు ఎంచుకోలేదు. అసలు ఈ రెండు తేదీల్లో తీర్పు ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వం కానీ, కోర్టు కానీ ప్రకటించలేదు.

Also Read నేడే అయోధ్య తీర్పు... ఇది ఎవరి విజయం కాదు.. ప్రధాని మోదీ...

అకస్మాత్తుగా, శుక్రవారం రాత్రి, అయోధ్య కేసుపై శనివారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువడనున్నట్లు ప్రకటించారు.ఈ ఆకస్మిక ప్రకటన సామాజిక వ్యతిరేకతను అరికట్టే వ్యూహంలో భాగంగా తీసుకున్నారు.  ఈ సున్నితమైన, భావోద్వేగమైన విషయంలో ఎలాంటి కుట్రలు జరగకుండా ఉండేందుకు సడెన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇదిలా ఉండగా.... ఈ తీర్పు విషయమై ప్రధాని మోదీ శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా స్పందించారు.  అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుందని ఆయన చెప్పారు. ఆ తీర్పు ఒకరి విజయం కాదని..  అలా అని ఓటమీ కూడా కాదన్నారు. ఈ తీర్పు భారత దేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.

దేశ ప్రజలంతా శాంతి, ఐక్యత, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయవ్యవస్థ  పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక, సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం అంతా కలిసి మెలసి నిలబడాలని పిలుపునిచ్చారు.

కాగా... ఈ తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios