Asianet News TeluguAsianet News Telugu

మోదీ రిటైర్ అయితే నేను రిటైర్ అయిపోతా: స్మృతి ఇరానీ

2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ మోదీయే ప్రధాని అవుతారని ఆమె జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీ నుంచి పోటీ చేసే విషయం బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. 

union minister smiriti irani comments on pm modi
Author
Pune, First Published Feb 4, 2019, 4:46 PM IST

పూణే : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల నుంచి రిటైర్ అయితే తాను కూడా తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు. 

పూణేలో మీడియాతో మాట్లాడిన ఆమె సినీ స్టార్ నుంచి బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయ్యానని భవిష్యత్ లో ప్రధాని మంత్రి అవ్వాలని తాను కోరుకోవడం లేదన్నారు. గొప్పనేతలైన దివంగత నేత అటల్ బిహారీ వాజ్ పేయి, నరేంద్ర మోదీల నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. 

2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ మోదీయే ప్రధాని అవుతారని ఆమె జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీ నుంచి పోటీ చేసే విషయం బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. 

2014 ఎన్నికల్లో అమేథి నియోజకవర్గ ప్రజలు తనను గుర్తించలేదన్నారు. అయితే ప్రస్తుతం తాను ఎవరు అనేది ప్రజలు తెలుసుకున్నారని స్మృతి తెలిపారు. భారత రాజకీయాల్లో సుష్మాస్వరాజ్, స్పీకర్ సుమిత్రా మహాజన్ లతో తాను స్ఫూర్తి పొందానని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios