Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో ఉద్రిక్తత... పోలీసులు,అటవీ అధికారులపై దాడి

మహారాష్ట్రలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, అటవీ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. అటవీ రక్షణ కోసం సొంత ప్రాంతాలకు దూరం చేయడంతో పాటు తమకు సరైన పునరావాసం కల్పించకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు ఈ దాడికి పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలపై కూడా  దాడిచేసి ధ్వంసం చేశారు.  ఈ ఘటన అమరావతి సమీపంలోని మేల్ ఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
tribal community members attacked police and forest officers
Author
Amaravathi, First Published Jan 23, 2019, 3:36 PM IST

మహారాష్ట్రలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, అటవీ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. అటవీ రక్షణ కోసం సొంత ప్రాంతాలకు దూరం చేయడంతో పాటు తమకు సరైన పునరావాసం కల్పించకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు ఈ దాడికి పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలపై కూడా  దాడిచేసి ధ్వంసం చేశారు.  ఈ ఘటన అమరావతి సమీపంలోని మేల్ ఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

ఎన్నో ఏళ్లుగా మేల్‌ఘాట్‌ అటవీ ప్రాంతంలో నివాసముంటున్న గిరిజనులను అక్కడి నుండి ఖాళీ చేయించిన అటవీ అధికారులు అకోలాలో పునరావాసం ఏర్పాటుచేశారు. అయితే ఈ పునరావాస కేంద్రాల్లో అధికారులు తమకు కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో గిరిజనులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిరోజులయినా తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన అడవిబిడ్డలు అక్కడి నుండి వెళళిపోయేందుకు సిద్దమయ్యారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న అటవీ అధికారులు పోలీసుల సాయంతో వారిని నిలువరించే ప్రయత్రం చేశారు. దీంతో పోలీసులు, గిరిజనుల మధ్య ఉద్రిక్తత చెలరేగి ఘర్షనకు దారితీసింది.  

ఈ ఆందోళనలో పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులపై కూడా గిరిజనులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 15 మంది పోలీసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ వాహనాలు, ఆపీసులపై కూడా దాడిచేసిన గిరిజనులు ఆస్తులను ధ్వంసం చేశారు.    

Follow Us:
Download App:
  • android
  • ios