Asianet News TeluguAsianet News Telugu

పెంపుడు కుక్క దూరమయ్యిందని.... యువతి ఆత్మహత్య

కోయంబత్తూర్ శివార్లలోని పెరియానైకెన్పాలయం ప్రాంతానికి చెందిన కవిత(23) అనే యువతి ఓ ప్రైవేటు కంపెనీలో డాక్యుమెంటరీ రైటర్ గా పనిచేస్తోంది. రెండు సంతవ్సరాల క్రితం కవిత ఓ కుక్క పిల్లను తెచ్చుకుంది. రెండేళ్ల పాటు ఆ కుక్క పిల్లను ఎంతో ప్రేమగా పెంచుకుంది. అయితే... ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

Told To Get Rid Of Pet Dog, Tamil Nadu Woman Allegedly Commits Suicide
Author
Hyderabad, First Published Nov 2, 2019, 11:52 AM IST

రెండేళ్లపాటు ప్రేమగా.... పెంచుకున్న కుక్క పిల్ల దూరం కావడంతో... ఓ యువతి తట్టుకోలేకపోయింది. కుక్క పిల్లను తన దగ్గర నుంచి తండ్రి దూరంగా తీసుకువెళ్లాడని... ఇంకోసారి కుక్కను తీసురావద్దని మందలించారని యువతి ఇంట్లో ఆత్మహత్య  చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకివెళితే.... కోయంబత్తూర్ శివార్లలోని పెరియానైకెన్పాలయం ప్రాంతానికి చెందిన కవిత(23) అనే యువతి ఓ ప్రైవేటు కంపెనీలో డాక్యుమెంటరీ రైటర్ గా పనిచేస్తోంది. రెండు సంతవ్సరాల క్రితం కవిత ఓ కుక్క పిల్లను తెచ్చుకుంది. రెండేళ్ల పాటు ఆ కుక్క పిల్లను ఎంతో ప్రేమగా పెంచుకుంది. అయితే... ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

వర్షం సమయంలో ఉరుములు, మెరుపులకు కుక్క బాగా బెదిరిపోయింది. దీంతో వెంటనే గట్టిగా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులకు చుట్టుపక్కల వాళ్లు బాగా డిస్టర్బ్ అయ్యారు. కుక్క మొరుగుతుండటం వల్ల తమకు నిద్ర పట్టడం లేదని, దాన్ని దూరంగా వదిలేయాలని ఇరుగుపొరుగు వారు కవిత తండ్రి పెరుమాళ్ ను కోరారు. దీంతో తండ్రి పెరుమాళ్ కవితను మందలించి పెంపుడు కుక్కను వదిలేయాలని ఆదేశించాడు. దీంతో ఆవేదన చెందిన కవిత తన గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
 
పోలీసులు వచ్చి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రపంచంలో అందరూ శాంతియుతంగా జీవించాలని, తల్లిదండ్రులు, అమ్మమ్మ, సోదరుడు తన పెంపుడు కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ కవిత రాసిన సూసైడ్ నోట్ లో కోరింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని కోరుతూ తల్లిదండ్రులు ప్రతీవారం ఆలయాన్ని సందర్శించాలని కవిత సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios