Asianet News TeluguAsianet News Telugu

మరో పరువు హత్య: కూతురిని చంపిన పేరేంట్స్

 నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య మరువక ముందే ... రాజస్తాన్‌లో పరువు హత్య చోటు చేసుకొంది.

Teen murdered by parents near Jaipur
Author
Jaipur, First Published Sep 30, 2018, 1:28 PM IST


జైపూర్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య మరువక ముందే ... రాజస్తాన్‌లో పరువు హత్య చోటు చేసుకొంది. ఓ యువకుడిని ప్రేమిస్తోందని భావించి ఈ హత్యకు పాల్పడ్డారు.  

కూతురు నోట్లో పురుగుల మందు పోసి... ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేశారు.  అయితే మార్కులు తక్కువగా వచ్చాయని తాము తిట్టడంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకొందని  మృతురాలి తల్లిదండ్రులు  పోలీసులను నమ్మంచే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది.


రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు 45 కి.మీ దూరంలోని శంకరపుర గ్రామంలో  ఈ ఘటన  శుక్రవారం నాడు ఉదయం చోటు చేసుకొంది. అయితే ఈ ఘటనకు పాల్పడిన తల్లిదండ్రులు పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని  తమ కూతురు ఆత్మహత్యకు ప్రయత్నించిందని  పోలీసులను నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

గోపాల్‌పురి గోస్వామి, పర్మదేవి దంపతులకు 16 ఏళ్ల  ప్రీతి అనే కూతురు ఉంది. ఆమె  అదే గ్రామంలోని స్కూల్లో పదోతరగతి చదువుతోంది. అయితే ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థితో ఆమె ప్రేమలో పడింది.

ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. దీంతో  ఆ విద్యార్థిని.. అతడితో చనువుగా ఉండేది. దీంతో తన కూతురు వల్ల కుటుంబం పరువుపోతోందని తల్లిదండ్రులు భావించారు.మూడు మాసాలుగా ఈ విషయమై గ్రామస్తులు  ప్రీతి తల్లిదండ్రులను ఈ విషయమై నిలదీస్తున్నారు.

ఈఘటన జరగడానికి ముందు రోజు కూతురు ముఖం చూడడానికి తనకు ఇష్టం లేదని  తండ్రి గోస్వామి తన భార్య పర్మదేవితో చెప్పాడు.  కూతురి వల్ల  గ్రామంలోతల ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేదన్నారు.

దీంతో భార్య,భర్తలు  కూతురును హత్య చేయాలని ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం కూతురును  తమ ఇంటికి సమీపంలోని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లారు. ముందుగా  కూతురి నోట్లు పురుగుల మందు పోశారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. 

వెంటనే తమతో తెచ్చుకొన్న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించారు. అంతేకాదు  పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు శనివారం రాత్రి ప్రీతి మరణించారు.

ఈ ఘటనకు  సంబంధించి ప్రీతి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంపై అనుమానం వచ్చిన  పోలీసులు విచారణ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. దీంతో గోపాల్‌పురి గోస్వామి, పర్మదేవిలను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ...

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

 

Follow Us:
Download App:
  • android
  • ios