Asianet News TeluguAsianet News Telugu

చౌకీదార్ చోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్: రాహుల్‌పై మరోసారి సుప్రీం సీరియస్

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు సీరియస్ అయింది. రాఫెల్ వ్యవహారంలో  తాము అనని వ్యాఖ్యలను కూడ తమకు ఎలా ఆపాదిస్తారని కోర్టు రాహుల్‌ను ప్రశ్నించింది.
 

supreme court serious comments on rahul gandhi
Author
New Delhi, First Published Apr 30, 2019, 3:13 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు సీరియస్ అయింది. రాఫెల్ వ్యవహారంలో  తాము అనని వ్యాఖ్యలను కూడ తమకు ఎలా ఆపాదిస్తారని కోర్టు రాహుల్‌ను ప్రశ్నించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాని నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తాము ఎప్పుడు సమర్ధించామో చెప్పాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రశ్నించారు.

ఈ విషయమై రాహుల్ ‌గాంధీ ఇచ్చిన వివరణతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు.  రాహుల్ గాంధీ రెండోసారి దాఖలు చేసిన అఫిడవిట్‌లో పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టుగా లేదని సుప్రీంకోర్టు  అభిప్రాయపడింది.

తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీ రెండు అఫిడవిట్లను ఎందుకు దాఖలు చేశారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చౌకీదార్ వ్యాఖ్యలపై తమను తప్పుదోవ పట్టించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది.

 
సంబంధిత వార్తలు

చౌకీదార్ చోర్ వివాదం: రాహుల్ గాంధీకి సుప్రీం షాక్

విచారం: చౌకీదార్ చోర్ కామెంట్స్‌‌పై దిగొచ్చిన రాహుల్‌

మీనాక్షి లేఖి ఫిర్యాదు: రాహుల్‌గాంధీకి సుప్రీం నోటీసులు

రాహుల్‌కు ఈసీ నోటీసుషాక్: 24 గంటల్లో వివరణ ఇవ్వాలి

Follow Us:
Download App:
  • android
  • ios