Asianet News TeluguAsianet News Telugu

ఓపీనియన్ పోల్: మోడీకి ఎస్పీ, బిఎస్పీ పొత్తు పరీక్ష

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దేశమెుత్తం ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టిసారించింది. ఇకపోతే ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిణామాలను మాత్రం నిశితంగా గమనిస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఎస్పీ, బీఎస్పీ పార్టీ పొత్తుల ప్రభావం బీజేపీపై ఎలా ఉంటుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది.
 

SP-BSP Alliance for 2019 Polls Could Hit PM Modi's Chances of Return to Power, Indicates Survey
Author
Uttar Pradesh, First Published Dec 25, 2018, 4:55 PM IST

ఉత్తరప్రదేశ్: ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దేశమెుత్తం ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టిసారించింది. ఇకపోతే ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిణామాలను మాత్రం నిశితంగా గమనిస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఎస్పీ, బీఎస్పీ పార్టీ పొత్తుల ప్రభావం బీజేపీపై ఎలా ఉంటుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది.

ఇకపోతే ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీల పొత్తు ప్రధాని నరేంద్రమోదీ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉంది. ఇటీవలే ఏపీబీ న్యూస్ సీ ఓటర్స్ సంస్థ ఉత్తరప్రదేశ్ లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు ఆసక్తికర తీర్పునిస్తున్నాయి. 

బీఎస్పీ సమాజ్ వాద్ పార్టీ పొత్తు ఉంటే మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి రావడం కష్టమని తేల్చి చెప్పింది. ఒకవేళ పొత్తు అటూ ఇటూ అయితే ప్రధాని నరేంద్రమోదీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేసింది. 

ఏబీపీ న్యూస్ సీ ఓటర్స్ సర్వే ప్రకారం ఎస్పీ బీఎస్పీల మధ్య పొత్తు ఫెయిల్ అయితే ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 291 ఎంపీ  సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి అదనంగా 19 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది. 

ఒకవేళ ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఎన్డీఏ 247 సీట్లకే  పరిమితం అవుతుందని తెలిపింది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు మరో 25 స్థానాలు కావాల్సి ఉంటుందని చెప్పింది.  2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించిందని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వం ఏర్పాటులో యూపీ ప్రభావం ఎంతో ఉందని తెలిపింది. 

80 పార్లమెంట్ స్థానాలకు గానూ 71 స్థానాలను గెలుచుకుందని సీఓటర్స్ సర్వే స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగితే 50 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఎన్డీఏ 28 సీట్లు కోల్పోయి కేవలం 43 సీట్లకే పరిమితం కావాల్సి వస్తుందని తెలిపారు.  

మాహాకూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికార ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో తేలికగా అధికారంలోకి రావచ్చని భావిస్తోంది. 

ఇకపోతే ఉత్తరప్రదేశ్ లో కీలక నియోజకవర్గాల్లో బీజేపీ దెబ్బతింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నియోజకవర్గమైన ఘోరక్ పూర్, డిప్యూటీ సీఎం నియోజకవర్గమైన ఫూల్ పుర్, కైరానా నియోజకవర్గాల్లో ఆర్ఎల్డీ విజయం సాధించడం కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

ఇకపోతే ఒడిస్సా ఎన్నికల్లో బీజేపీ 21 లోక్ సభ స్థానాలకు గానూ 15 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సీ ఓటర్స్ సర్వే తెలిపింది. అటు యూపీఏ మాత్రం మహారాష్ట్ర, తమిళనాడు రాష్టరాల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios