Asianet News TeluguAsianet News Telugu

శబరిమల వివాదం.. ఎంపీలకు సోనియా వార్నింగ్

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ.. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Sabarimala row: Sonia Gandhi stops black band protest by Congress MPs
Author
Hyderabad, First Published Jan 4, 2019, 4:15 PM IST

శబరిమలలో వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. సుప్రీం కోర్టు.. అన్ని వయసుల మహిళలు.. అయ్యప్పను దర్శించుకోవచ్చు అన్న తీర్పు ఇచ్చిన తర్వాత ముగ్గురు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశించారు. వారు అయప్ప స్వామిని దర్శించుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఆందోళనలతో కేరళ అట్టుడికిపోతోంది.

కాగా.. ఈ విషయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ.. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ రోజు  పార్లమెంట్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని భావించారు. కానీ సోనియా గాంధీ ఎంపీలను అలా చేయకుండా నివారించారు. 

కేరళలో జరుగుతున్న బ్లాక్ డే ఆందోళనలకు నిజానికి ఎంపీలు సంఘీభావం తెలుపాలని నిర్ణయించుకున్నారు. కానీ సోనియా ఆ అంశంపై ఓ స్పష్టమైన వార్నింగ్ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న ధ్యేయంతో ఉందని, అందుకే పార్లమెంట్‌లో అలాంటి నిరసన వద్దు అని తమ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిరసనలు కేవలం కేరళ రాష్ట్రానికి పరిమితం చేయాలని సోనియా తన ఆదేశాల్లో ఆ పార్టీ ఎంపీలకు చెప్పినట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios