Asianet News TeluguAsianet News Telugu

ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా

ఆర్బీఐ గవర్నర్  ఉర్జిత్ పటేల్  సోమవారం నాడు  రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు

rbi governor urjit patel resigns
Author
New Delhi, First Published Dec 10, 2018, 5:21 PM IST

న్యూఢిల్లీ:  ఆర్బీఐ గవర్నర్  ఉర్జిత్ పటేల్  సోమవారం నాడు  రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కొన్ని రోజులుగా  ప్రభుత్వంతో  కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు.

రిజర్వ్ బ్యాంకు నిల్వలను  తమకు ఇవ్వాలని  కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఈ ప్రతిపాదనను  ఆర్బీఐ  గవర్నర్ తో పాటు పలువురు ఆర్థికవేత్తలు  వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం నాడు ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.  

కేంద్ర ప్రభుత్వ సలహదారుగా పనిచేసిన అరవింద సుబ్రమణియన్‌ కూడ కూడ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్  రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. 2016 నుండి ఆర్బీఐ గవర్నర్‌ గా పనిచేస్తున్నారు.2019 సెప్టెంబర్ వరకు ఉర్జిత్ పటేల్‌ పదవీ కాలం ముగియనుంది. పదవీ కాలం పూర్తి కాకముందే  ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios