Asianet News TeluguAsianet News Telugu

శానిటరీ నాప్‌కిన్: స్కూల్లోనే విద్యార్థినుల బట్టలిప్పి తనిఖీ చేసిన టీచర్లు

పంజాబ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్‌లో  శానిటరీ నాప్‌కిన్ కన్పించడంతో... ఆ శానిటరీ నాప్‌కిన్ ధరించిన విద్యార్థులు ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు గాను  టీచర్లు విద్యార్థుల దుస్తులను విప్పారు. 

Punjab School Teachers 'Strip' Girls to Check for Sanitary Pads, CM Orders Inquiry
Author
Punjab, First Published Nov 4, 2018, 12:04 PM IST

చంఢీఘడ్: పంజాబ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్‌లో  శానిటరీ నాప్‌కిన్ కన్పించడంతో... ఆ శానిటరీ నాప్‌కిన్ ధరించిన విద్యార్థులు ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు గాను  టీచర్లు విద్యార్థినుల దుస్తులను విప్పారు. ఒక్కొక్కరిని తనిఖీ చేశారు. ఈ ఘటనరాష్ట్రంలో  సంచలనం నృష్టించింది. ఈ ఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

పంజాబ్ రాష్ట్రంలోని ఫిజికా జిల్లాలోని ఓ. ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్‌లో మూడు రోజుల క్రితం శానిటరీ నాప్‌కిన్ కన్పించింది. ఈ శానిటరీ నాప్‌కిన్ ను ఎవరు ఉపయోగించారోనని  టీచర్లు అడిగారు. అయితే శానిటరీ నాప్‌కిన్ వాడిన విషయాన్ని ఎవరూ కూడ బయటపెట్టలేదు.

దీంతో పాఠశాల ఆవరణలోనే విద్యార్థినుల ట్టలిప్పేసి మరీ శానిటర్ నాప్‌కిన్ ఎవరు వాడారనే విషయాన్ని కనుక్కొనేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు విద్యార్థినులు ఏడుస్తూ దుస్తులను విప్పేశారు. ఈ విషయమై విద్యార్థినులు  తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.  

దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు స్కూల్ టీచర్ల తీరును ఎండగట్టారు.ఈ విషయమై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విర్యాదు ఆధారంగా ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు టీచర్లను  ఆ స్కూల్ నుండి  బదిలీ చేశారు. 

ఈ ఘటనపై  పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్  సీరియస్ అయ్యారు. సోమవారం నాటికి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను అందివ్వాలని ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios