Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీ తివారీ కుమారుడి హత్య వెనక ఆస్తులు, అఫైర్

తన భర్తను తానే హత్య చేసినట్లు అపూర్వ అంగీకరించారని పోలీసులు చెప్పారు. తీవ్రమైన గొడవ జరిగిన తర్వాత అపూర్వ రోహిత్ గొంతు నులిమి, దిండుతో అదిమిపట్టి చంపినట్లు వారు చెప్పారు.

Property and affair behind the murder of Rohit Tiwari
Author
Mumbai, First Published Apr 25, 2019, 1:17 PM IST

ముంబై: తన ఆశలు, కలలు నీరుగారిపోవడం పల్లనే తాను భర్తను హత్య చేసినట్లు రోహిత్ తివారీ భార్య అపూర్వ చెప్పారు. ఎన్డీ తివారీ కుమారుడైన రోహిత్ ను హత్య చేయడానికి గల కారణాలను ఆమె పోలీసులకు వివరించారు. తన వివాహ బంధం అసంతృప్తిగానూ దారుణంగానూ ఉందని చెప్పారు. 

తన భర్తను తానే హత్య చేసినట్లు అపూర్వ అంగీకరించారని పోలీసులు చెప్పారు. తీవ్రమైన గొడవ జరిగిన తర్వాత అపూర్వ రోహిత్ గొంతు నులిమి, దిండుతో అదిమిపట్టి చంపినట్లు వారు చెప్పారు. అతను విపరీతంగా మద్యం సేవించి ఉన్నాడని, దాంతో ప్రతిఘటించే స్థితిలో కూడా లేడని అన్నారు. 

అరెస్టు చేయడానికి ముందు అపూర్వను పోలీసులు మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్నారు. రోహిత్ మృతదేహం ఏప్రిల్ 16వ తేదీన అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న విషయం తెలిసిందే. గుండెపోటుతో అతను మరణించినట్లు తొలుత భావించారు. 

ఇండోర్ కు చెందిన అపూర్వకు 2018 మార్చిలో మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా రోహిత్ పరిచయమయ్యాడు. ఏడాది తర్వాత ఏప్రిల్ నిశ్చితార్థం జరిగింది. నెలలోగా వివాహం చేసుకున్నారు. అయితే, వారి కాపురం సజావుగా సాగలేదు. రోజు రోజుకూ గొడవలు తీవ్రమవుతూ వచ్చాయి. 

ఆ స్థితిలో అపూర్వ, రోహిత్ శేఖర్ ఒకే ఇంట్లో విడివిడిగా ఉండడం ప్రారంభించారు. విడాకులు తీసుకుందామని చాలా సార్లు అనుకున్నారు. జూన్ లో విడాకులు తీసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకున్నారని రోహిత్ తల్లి ఉజ్వల శర్మ చెప్పారు. 

అపూర్వకు పెళ్లికి ముందే అఫైర్ ఉందని, ఆమె కుటుంబ సభ్యుల డబ్బుల మనుషులని ఆమె వ్యాఖ్యానించారు. తమకు డిఫెన్స్ కాలనీలో ఉన్న ఆస్తిపై కన్నేశారని ఆమె చెప్పారు. సంతాప దినాలు పూర్తయిన తర్వాత ప్రతి విషయమూ చెప్తానని ఆమె అన్నారు. 

ఏప్రిల్ 15వ తేదీన ఓటు వేయడానికి రోహిత్, ఉజ్వల, బంధువు ఉత్తరాఖండ్ లోని కొతగోడంలో ఓటు వేసి తిరిగి వచ్చారు. మర్నాడు పని మనిషి సాయంత్రం 4 గంటలకు పని మనిషి రోహిత్ స్పృహ తప్పి పడిపోయి ఉండడాన్ని గమనించింది. ముక్కు నుంచి రక్తం కారుతోంది. వెంటనే రోహిత్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios