Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కి షాక్: శివసేనలో చేరిన ప్రియాంక

కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న ప్రియాంక చతుర్వేది గురువారమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శుక్రవారం శివసేన పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. 

priyanka chaturvedi joins sivasena
Author
Mumbai, First Published Apr 19, 2019, 3:12 PM IST

ముంబై : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం శివసేన పార్టీలో చేరిపోయారు. శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న ప్రియాంక చతుర్వేది గురువారమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శుక్రవారం శివసేన పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. 

కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు తెంచుకున్నాకే శివసేనలో చేరానని స్పష్టం చేశారు. ఇటీవలే ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రియాంక చతుర్వేది పాల్గొన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు తనపట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే లోక్ సభ ఎన్నికల దృష్ట్యా తక్కువ సమయంలోనే వారిపై సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ కోసం చెమటోడ్చిన వారికన్నా దుష్టులకే పెద్దపీట వేస్తారా అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా గురువారం ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. తన సేవలకు పార్టీలో విలువ లేదని అర్థమవుతోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నాం ఆమె శివసేన పార్టీలో చేరారు.  

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గుడ్ బై

‘‘కాంగ్రెస్ లో గూండాలు’’... సొంత పార్టీపై ప్రియాంక ఫైర్

Follow Us:
Download App:
  • android
  • ios