Asianet News TeluguAsianet News Telugu

కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న మోడీ: భారత్ వైపు మాత్రమే

భారత్ వైపున కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాని నరేంద్రమోడీ నవంబర్ 9న ప్రారంభిస్తారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో కర్తార్‌పూర్ యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమానికి మోడీ హాజరవుతారు.

PM narendra modi inaugurate kartarpur corridor from indian side
Author
New Delhi, First Published Oct 22, 2019, 3:17 PM IST

భారత్ వైపున కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాని నరేంద్రమోడీ నవంబర్ 9న ప్రారంభిస్తారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో కర్తార్‌పూర్ యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమానికి మోడీ హాజరవుతారు.

అదే రోజున పాక్ భూభాగంలో నిర్మించిన కర్తార్‌పూర్ కారిడార్‌ను ఆ దేశ ప్రభుత్వం ప్రారంభించి భారతీయ సిక్కు భక్తులకు స్వాగతం పలుకుతుంది. పాక్‌లో ఈ కారిడార్ నరోవల్ జిల్లాలో ఏర్పాటైంది.

కారిడార్ ప్రారంభోత్సవం, ఇతర వివరాలను చర్చించేందుకు గాను ఈ నెల 23న జరిగే సమావేశానికి హాజరుకావాల్సిందిగా పాక్‌కు భారత ప్రభుత్వం ఆహ్వానం పలికింది. దీనిపై అటు నుంచి ఇంకా స్పందన రాలేదు. 

PM narendra modi inaugurate kartarpur corridor from indian side

భారత సిక్కులు కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవాలంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రసాదం పూర్తిగా ఉచితమని.. దానిని ప్యాకింగ్ చేసినందుకే రూ.151 వసూలు చేస్తామని గురుద్వారా ప్రబంధక్ కమిటీ వెల్లడించింది.

Also Read: భారత సిక్కుల నుంచి రూ.1,400 ఎంట్రీ ఫీజు..కర్తార్‌పూర్‌తో పాకిస్థాన్‌కి కాసుల పంట

భారతదేశంలోని సిక్కుల చిరకాల వాంఛ కర్తార్‌పూర్ కారిడార్. దీని ద్వారా భారత్‌కు చెందిన యాత్రికులు నేరుగా పాకిస్తాన్‌లోని గురుద్వారా సాహిబ్‌ను దర్శించుకోవచ్చు. మరోవైపు భారత యాత్రికులు గురుద్వారాను దర్శించుకోవాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించలేదు. 

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పాక్ ఇప్పటికే సిద్ధం చేసింది. దీని ప్రకారం.. ఒక్కో యాత్రికుడు 20 డాలర్లు (భారత కరెన్సీలో రూ.1,400) చెల్లించాలని. అంతేకాకుండా ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది.

PM narendra modi inaugurate kartarpur corridor from indian side

ప్రసాదం పూర్తిగా ఉచితమని.. దానిని ప్యాకింగ్ చేసినందుకే రూ.151 వసూలు చేస్తామని గురుద్వారా ప్రబంధక్ కమిటీ వెల్లడించింది. అయితే ఎంత న్యాయమైన ప్యాకింగ్ అయినా రూ.10కి మించదని పాకిస్తాన్ వసూలు చేస్తోన్న ధరలు అన్యాయంగా ఉన్నాయని భారత అధికారులు వాదిస్తున్నారు.

Also Read: మోదీని కాదని మాజీ ప్రధానికి పాక్ ఆహ్వానం: తిరస్కరించిన మన్మోహన్ సింగ్

భారత సిక్కు యాత్రికుల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని భారత్ పలుమార్లు పాకిస్తాన్‌ను కోరింది. అయినప్పటికీ మన వాదనను దాయాది దేశం పట్టించుకోలేదు. ఈ కారిడార్ ద్వారా రోజుకు సగటున 5 వేలమంది వరకు భారతీయులు గురుద్వారా దర్శనానికి వెళ్తారని అంచనా.

ఈ ప్రకారం ఒక్కొక్కరి నుంచి ప్రవేశ రుసుము కింద రూ.1400 వసూలు చేస్తే రోజుకు ఆ దేశానికి రూ.70 లక్షల ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తీవ్రస్థాయిలో అప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశానికి ఈ కారిడార్ ద్వారా నెలకు సుమారు రూ.20 కోట్లకు పైబడి ఆదాయం వస్తుందని అంచనా.

PM narendra modi inaugurate kartarpur corridor from indian side

సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ దేవ్ తన జీవితంలో చివరి 18 ఏళ్లు కర్తార్‌పూర్‌లోనే గడిపి, ఇక్కడే తుదిశ్వాస విడిచారు. అందుకే ఈ గురుద్వారాకు సిక్కులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు.

దేశ విభజనతో ఈ ప్రాంతం పాకిస్తాన్‌ ఆధీనంలోకి వెళ్లడంతో భారత్‌లోని సిక్కులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సమాధి నెలకొన్న దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ భారత్-పాకిస్తాన్‌లు కర్తార్‌పూర్‌ కారిడార్ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా చేపట్టాయి.

ఈ కారిడార్ ద్వారా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ మసీదుతో పాక్‌లోని కర్తార్‌పూర్‌ను అనుసంధానం చేస్తారు. రావి నదీతీరంలోని కర్తార్‌పూర్‌కు భారత యాత్రికులు వీసా లేకుండా చేరుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతిస్తుంది. 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం పంజాబ్‌లోని డేరా బాబానాయక్ నుంచి పాక్ కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను కలపనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios