Asianet News TeluguAsianet News Telugu

ఉత్తర ప్రదేశ్ లో చెలరేగిన హింస...నిరసనకారుల దాడిలో ఎస్సై మృతి (వీడియో)

ఉత్తర ప్రదేశ్ లో హిందువులు పూజించే ఆవులను కొందరు దుండగులు కబేళాలకు తరలిస్తున్నారని  పుకార్లు వ్యాపించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ అల్లర్లు యూపీలోని బులంద్ షహర్ పట్టణంలో వ్యాపించడంతో తీవ్ర హింసకు దారితీసింది. ఈ పుకార్ల కారణంగా చెలరేగిన అల్లర్లలో పోలీస్ అధికారి బలయ్యాడు. 
 

one policeman killed in Bulandshahr Violence
Author
Bulandshahr, First Published Dec 3, 2018, 5:02 PM IST

  ఓ వర్గం పవిత్రంగా పూజించే ఆవులను కొందరు దుండగులు కబేళాలకు తరలిస్తున్నారని  పుకార్లు వ్యాపించడంతో ఉత్తర ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ అల్లర్లు యూపీలోని బులంద్ షహర్ పట్టణంలో వ్యాపించడంతో తీవ్ర హింసకు దారితీసింది. ఈ పుకార్ల కారణంగా చెలరేగిన అల్లర్లలో పోలీస్ అధికారి బలయ్యాడు. 

బులంద్ షహర్ లోని ఓ కబేళాలో ఆవులను వధిస్తున్నట్లు నగరంలో పుకార్లు చెలరేగడం హింసకు దారితీసినట్లు బులంధ్ శహర్ జిల్లా న్యాయవాది అంజు ఝా వెల్లడించారు. దీంతో నగరంలోని ఓ వర్గం ఆ కబేళా వద్దకు భారీగా చేరుకుని రాళ్లతో దాడిచేయడంతో పాటు అక్కడున్న వాహనాలను ద్వంసం చేశారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆందోళనకారుల దాడిలో ఓ ఎస్సై తీవ్రంగా గాయపడి మృతిచెందినట్లు అంజు ఝా తెలిపారు. అలాగే ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. 

"

Follow Us:
Download App:
  • android
  • ios