Asianet News TeluguAsianet News Telugu

పూరీ ఆలయంలోకి తుపాకులు, బూట్లతో వెళ్లొద్దు.. పోలీసులకు సుప్రీం హుకుం

ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలోకి ఇకపై బూట్లు, ఆయుధాలతో ప్రవేశించరాదంటూ సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. జగన్నాథ ఆలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన క్యూ పద్ధతిని నిరసిస్తూ ఈ నెల 3న హింస చెలరేగిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. 

no weapons shoes inside puri temple says supreme court
Author
Puri, First Published Oct 11, 2018, 11:43 AM IST

ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలోకి ఇకపై బూట్లు, ఆయుధాలతో ప్రవేశించరాదంటూ సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. జగన్నాథ ఆలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన క్యూ పద్ధతిని నిరసిస్తూ ఈ నెల 3న హింస చెలరేగిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

కొత్తగా ప్రవేశపెట్టిన క్యూ సిస్టం ప్రకారం 12వ శతాబ్థానికి చెందిన ఈ ఆలయంలోకి సింహద్వారం ద్వారా భక్తులను ఆలయ ప్రవేశం చేయించి ఉత్తర ద్వారం ద్వారా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని నిరసిస్తూ శ్రీ జగన్నాథ్ సేన ఈ నెల 3న ఇచ్చిన 12 గంటల బంద్‌ హింసాత్మకంగా మారింది.

ఆందోళనకారుల దాడిలో తొమ్మిది మంది పోలీసులు గాయపడ్డారు.. జగన్నాథ ఆలయానికి 500 మీటర్ల దూరంలోని ఆలయ బోర్డ్ పరిపాలనా కార్యాలయాన్ని అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. దీనిపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 47 మందిని అరెస్ట్ చేశామని.. పరిస్ధితి అదుపులో ఉందని తెలిపింది.

మరోవైపు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ఘర్షణ నాడు పోలీసులు ఆయుధాలు, బూట్లతో ఆలయంలోకి ప్రవేశించారని జగన్నాథ ఆలయం తరపు న్యాయవాది ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఇకపై పోలీసులు ఆలయంలోకి బూట్లు, ఆయుధాలతో వెళ్లరాదంటూ ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios