Asianet News TeluguAsianet News Telugu

నోబెల్ ప్రైజ్ విన్నర్ అభిజిత్ కోసం... అమ్మ చేతి చేపల పులుసు రెడీ..!

అభిజిత్ బెనర్జీ.. ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నారు. కాగా... విదేశీ మహిళను పెళ్లి చేసుకోవడం వల్లే అతనికి నోబెల్ వచ్చిందనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. కాగా... ఆ విమర్శలకు ఆమె ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

Mom's Fish Curry, Mutton Kebab, Payesh For Abhijit Banerjee's Homecoming
Author
Hyderabad, First Published Oct 22, 2019, 11:23 AM IST

ఆర్థిక‌శాస్త్రంలో ఓ భారతీయుడు నోబెల్ బహుమతి గెలిచిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గెలిచిన రెండ‌వ భార‌తీయ సంత‌తి వ్య‌క్తిగా అభిజిత్ బెన‌ర్జీ నిలిచారు. గ‌తంలో అమ‌ర్త్యాసేన్ ఎక‌నామిక్స్‌లో నోబెల్ గెలిచారు. కాగా... నోబెల్ బహుమతి గెలిచి ఇంటికి వస్తున్న అభిజిత్ బెనర్జీ కోసం ఆమె తల్లి నిర్మలా బెనర్జీ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కుమారుడికి నోబెల్ రావడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. తన కుమారుడు పడిన కష్టానికి గుర్తింపు దక్కిందని ఆమె అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలన కోసం కృషి చేశాడని... దానికి తగిన ప్రతిఫలమే ఇదని ఆమె పేర్కొన్నారు. 

కాగా... అభిజిత్ బెనర్జీ.. ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నారు. కాగా... విదేశీ మహిళను పెళ్లి చేసుకోవడం వల్లే అతనికి నోబెల్ వచ్చిందనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. కాగా... ఆ విమర్శలకు ఆమె ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

నా కుమారుని వ్యక్తిగత జీవితం, వివాహం గురించి మాట్లాడుతున్నారు. విదేశీయురాలిని వివాహం చేసుకున్నందువల్లే నోబెల్‌ బహుమతికి అర్హుడయ్యారని అనుకుంటే మీరూ అదే విధంగా పొందవచ్చు. ఆ విధంగా చూస్తే అనేకమంది నోబెల్‌ బహుమతి విజేతలు ఉంటారు.' అని నోబెల్‌ బహుమతి విజేత అభిజిత్‌ బెనర్జీ తల్లి నిర్మలా బెనర్జీ సోమవారం ఘాటుగా స్పందించారు. మీడియాతో ఆమె కొల్‌కతాలో మాట్లాడుతూ తమ కుమారునిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రత్యర్థులు వాస్తవాలను నిరూపించుకోలేరని స్పష్టం చేశారు.

అభిజిత్ బెనర్జీ తల్లి నిర్మలా బెనర్జీ కూడా ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అవ్వడం విశేషం. ఇదిలా ఉండగా... అభిజిత్ బెనర్జీ... నోబెల్ గెలిచిన తర్వాత తొలిసారి స్వదేశానికి శనివారం వచ్చారు. శనివారం ఢిల్లీ చేరుకున్న ఆయన వరసగా ఇంటర్వ్యూలు, మీటింగ్స్ లాంటివి వాటితో బిజీ గడిపేశారు. కాగా... మంగళవారం ఉదయం ఆయన తన తల్లికి దగ్గరికి చేరుకున్నారు. తిరిగి గురువారం ఆయన మళ్లీ వెళ్లిపోనున్నారు.

ఈ సందర్భంగా నిర్మలా బెనర్జీ మాట్లాడుతూ... ‘ నా కొడుకు ఢిల్లీ వచ్చిన తర్వాత అసలు మాట్లాడానికి కూడా కుదరలేదు. నా దగ్గరకు వచ్చాక ఏం చేయాలి అనేది మీమేమి ప్లాన్ చేసుకోలేదు. నా కొడుకును కలుసుకోవాడినికి ఎంతో ఆత్రుతగా ఉన్నాను. ’ అని చెప్పారు.

అంతేకాకుండా తన కొడుకు ఫుడ్డీ అని... తనచేతి వంట అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పారు. తన కొడుకు కోల్ కతా వచ్చిన ప్రతిసారి చేపలు ఎక్కువగా తింటాడని తెలిపింది. అందుకే చేపల పులుసు, మటన్ కబాబ్, రసగుల్లా తన  చేత్తో తయారు చేసి పెట్టనున్నట్లు చెప్పారు. 

కాగా... అభిజిత్... ఫిబ్ర‌వ‌రి 21, 1961లో అభిజిత్ ముంబైలో జ‌న్మించారు. కోల్‌క‌త్తా వ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్ చేశారు. జ‌వ‌హ‌ర్‌లాస్ వ‌ర్సిటీ నుంచి పీజీ చేశారు. 1988లో అమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. క్యాంబ్రిడ్జ్ లోని మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఫోర్డ్ ఫౌండేష‌న్‌లో ఆర్థిక‌శాస్త్ర ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. 

2003లో అబ్దుల్ ల‌తీఫ్ జ‌మీల్ పావ‌ర్టీ యాక్ష‌న్ ల్యాబ్‌ను అభిజిత్ ప్రారంభించారు. దాంట్లో డుఫ్లో, సెంథిల్ ములైనాథ‌న్‌లు కూడా ఉన్నారు. ఆ ప‌రిశోధ‌న‌శాల‌కు అభిజిత్ డైర‌క్ట‌ర్‌గా ఉన్నారు. యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌లోని డెవ‌ల‌ప్‌మెంట్ ఎజెండాలోనూ అభిజిత్ స‌భ్యుడిగా ఉన్నారు. 

అభిజిత్ భార్యే ఈస్త‌ర్ డుఫ్లో. ఈమెకు కూడా నోబెల్ క‌మిటీ అవార్డు ఇచ్చింది. అభిజిత్ వ‌ద్దే డుఫ్లో పీహెచ్‌డీ చేసింది. ఆర్థిక‌శాస్త్రం కేట‌గిరీలో నోబెల్ అందుకున్న రెండ‌వ మ‌హిళ‌గా డుఫ్లో రికార్డు క్రియేట్ చేసింది. నోబెల్ అందుకున్న అతిపిన్న వ‌య‌సున్న మ‌హిళ‌గా కూడా ఆమె ఘ‌న‌త సాధించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios