Asianet News TeluguAsianet News Telugu

ఓపీనియన్ పోల్: మళ్లీ మోడీదే హవా

: 2019 ఎన్నికల్లో కూడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సీ ఓటర్ ఒపీనియన్ తేల్చి చెప్పింది. ఈ దఫా ఎన్డీఏకు పార్లమెంట్‌లో 291 ఎంపీ స్థానాలు దక్కనున్నాయని ఆ సర్వే  తేల్చింది

Modi government all set to comeback to power, says C-Voter survey
Author
New Delhi, First Published Dec 25, 2018, 4:23 PM IST

న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో కూడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సీ ఓటర్ ఒపీనియన్ తేల్చి చెప్పింది. ఈ దఫా ఎన్డీఏకు పార్లమెంట్‌లో 291 ఎంపీ స్థానాలు దక్కనున్నాయని ఆ సర్వే  తేల్చింది. అయితే యూపీలో ఎష్పీ, బీఎస్పీ పొత్తు ఉంటే ఎన్డీఏకు వచ్చే సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని  ఈ సర్వే ప్రకటించింది.

వచ్చే ఏడాది పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  ఏ కూటమికి విజయావకాశాలు ఉన్నాయనే దానిపై సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారంగా ఎన్డీఏకు 291 సీట్లు వస్తాయని తేలింది. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో ఎన్డీఏకు వచ్చే సీట్లు తగ్గే అవకాశం ఉందని  సీ ఓటర్ సర్వే ప్రకటించింది. ఒకవేళ అదే జరిగితే ఏన్డీఏకు 247 సీట్లు మాత్రమే దక్కే  అవకాశం ఉందని  ఆ సంస్థ ప్రకటించింది.

యూపీఏకు వచ్చే ఎన్నికల్లో 171 సీట్లు మాత్రమే వస్తాయని సీ ఓటర్ సర్వే తేల్చింది. యూపీ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు ప్రభావం ఎన్డీఏ కూటమిపై పడితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొత్త మిత్రుల కోసం బీజేపీ వెతుక్కోవాల్సిన అనివార్య  పరిస్థితులు లేకపోలేదు.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు కావాలి.ఇటీవల మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అయితే ఈ రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇస్తారని ఈ సర్వే తేల్చింది.

మధ్యప్రదేశ్‌లో  మొత్తం 29 లోక్‌సభ స్థానాలు ఉంటే బీజేపీ 23 స్థానాలను కైవసం చేసుకొంది. రాజస్థాన్‌లోని 25 సీట్లలో 19 సీట్లు ఛత్తీస్‌ఘడ్‌లో 11 సీట్లలో ఐదు స్థానాలను గెలుచుకొంటుందని సీ ఓటర్ సర్వే ప్రకటించింది.

బీహర్‌లోని 40 స్థానాల్లో ఏన్డీఏ 35 స్థానాలను గెలుచుకొంటుందని సీ ఓటర్ సర్వే ప్రకటించింది.బెంగాల్ రాష్ట్రంలో మాత్రం కేవలం 9 స్థానాలతోనే ఎన్డీఏ సరిపెట్టుకోవాల్సి వస్తోందని తేల్చి చెప్పింది. యూపీలో ఎస్పీ,బిఎస్పీ పొత్తు పెట్టుకొంటే ఎన్డీఏకు దెబ్బగా సీ ఓటర్ తేల్చింది. ఏ పొత్తు లేకుండా విడి విడిగా పార్టీలు పోటీ చేస్తే ఎన్డీఏకు యూపీలో 72 సీట్లు దక్కుతాయని  ఈ సర్వే తేల్చింది.

దక్షిణ భారత్‌లో  ఎన్డీఏకు ఆశించిన సీట్లు దక్కవని ఈ సర్వే ప్రకటించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని 129 సీట్లలో కేవలం 15 స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ విజయం సాధిస్తోందని  ఈ సర్వే ప్రకటించింది.

ఏపీలో ఓటర్లు టీడీపీకి అనుకూలంగా తీర్పు ఇస్తారని ఈ సర్వే  ప్రకటించింది.మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో  డీఎంకె ఘన విజయం సాధించనుందని పేర్కొంది.గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి ఆశించిన స్థానాలు దక్కుతాయని, మహారాష్ట్రలో మాత్రం ఆ పార్టీ నష్టపోయే చాన్స్ ఉందని సీ ఓటర్ సర్వే తేల్చింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios