Asianet News TeluguAsianet News Telugu

మనిషి మాదిరిగానే: టీవీ చూస్తూ పాటలు వింటున్న ఆవు దూడ

ఓ దూడ మనిషి మాదిరిగా ప్రవర్తిస్తోంది.  ఈ దూడ మనుషులు ఉన్నచోటే తిరుగుతోంది. మనుషుల మాదిరిగానే  మ్యూజిక్ వింటూ డ్యాన్స్  చేస్తోంది.ఆకలి వేసిన సమయంలోనే  ఈ దూడ తల్లి వద్దకు వెళ్లి పాలు తాగుతోంది. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఆవు దూడ ఉంది.
 

Member of family: Villages sway to the tunes of musically-inclined calf
Author
Tamil Nadu, First Published May 2, 2019, 1:10 PM IST


చెన్నై: ఓ దూడ మనిషి మాదిరిగా ప్రవర్తిస్తోంది.  ఈ దూడ మనుషులు ఉన్నచోటే తిరుగుతోంది. మనుషుల మాదిరిగానే  మ్యూజిక్ వింటూ డ్యాన్స్  చేస్తోంది.ఆకలి వేసిన సమయంలోనే  ఈ దూడ తల్లి వద్దకు వెళ్లి పాలు తాగుతోంది. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఆవు దూడ ఉంది.

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా అంబూరులోని వీరాకుప్పం గ్రామానికి చెందిన ఆనందన్‌కు చెందిన ఆవు ఇటీవలనే మగ దూడకు జన్మనిచ్చింది.ఈ దూడ మనుషులు ప్రవర్తించినట్టుగానే ప్రవర్తిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

రాత్రి పూట చాప, దిండు ఉన్న చోటే ఈ ఆవు దూడ నిద్ర పోతుంది. పశువుల కోసం ఏర్పాటు చేసిన  నీళ్లను తాగడం లేదు. ఇంట్లోని వాళ్ల కోసం ఏర్పాటు చేసుకొన్న నిటీని మాత్రమే ఆ దూడ తాగుతోంది. 

చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన తినుబండారాలను తింటూ పిల్లలతో కలిసి ఆవు దూడ తిరుగుతోంది. టేప్‌రికార్డర్ ద్వారా కుటుంబసభ్యులు పాటలు వినే సమయంలో ఆవు దూడ లయ బద్దంగా కాళ్లు ఊపుతోంది.

దీంతో ఆవు దూడ కోసం ఆ కుటుంబసభ్యులు స్పీకర్లను ఏర్పాటు చేశారు. ఈ దూడకు వేలన్ అని ఆ కుటుంబసభ్యులు పేరు పెట్టారు. ఆనందన్ ‌ కూతురు కార్తీక కు  ఈ దూడ అత్యంత ఇష్టం. తమతో కలిసి ఆవు దూడ టీవీ కూడ చూస్తోందని  కార్తీక చెప్పారు. ఈ ఆవు దూడ వయస్సు 3 మాసాలు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios