Asianet News TeluguAsianet News Telugu

మహా మలుపుల మహా రాజకీయం:శివసేన సంచలన ప్రకటన

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మార్పు తిరుగుతున్నాయి. టామ్ అండ్ జెర్రీ లాగ ఇటు బీజేపీ అటు శివసేన కొట్టుకుంటున్నాయి. 

maha politics tougher than cyclone maha: shivasena mp sanjay rauth sensational comments..
Author
Mumbai, First Published Nov 3, 2019, 12:58 PM IST

ముంబై: మహా రాజకీయాలు మహా సైక్లోన్ కన్నా చాల వేగంగా కదులుతూ రాజకీయ సునామీని సృష్టిస్తుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారానికి బీజేపీ ఏర్పాట్లు చేస్తుండగా శివసేన ఇటు కాంగ్రెస్ తోని అటు ఎన్సీపీ తోని రహస్య చర్చలు జరుపుతుంది. 

బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్న వేళ, శివ సేన కూడా ఘాటుగా స్పందిస్తోంది. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ శివసేనకు 170మంది ఎమ్మెల్యేల మద్దతుందని బాంబు పేల్చాడు. శివసేన నుంచి 24 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ బెదిరిస్తున్న వేళ శివసేన ఈ బాంబు పేల్చడం ప్రస్తుతం చర్చ నీయంశంగా మారింది. 

Also read: "మహా" మలుపులు: ఫడ్నవీస్ భార్య స్పందన ఇదీ, పవార్ కు శివసేన ఫీలర్లు

ఇదిలావుంటే, సోమవారంనాడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేన మధ్య తగువు కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ భేటీకి ప్రాధాన్యం చేకూరింది. 

సోనియా గాంధీతో మాట్లాడాల్సిందిగా శివసేన ముఖ్య నేతలు పవార్ తో చెప్పినట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితిపై పవార్ సోనియాతో మాట్లాడుతారని అంటున్నారు. కానీ మహారాష్ట్ర రాజకీయాలపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కలిగేలా చూడాలని కాంగ్రెసు రాజ్యసభ ఎంపీ హుస్సేన్ దల్వాయి ఒకరు సోనియా గాంధీని కోరుతూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సోనియాతో పవార్ భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

Also read: ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇవ్వండి, పాలించి చూపిస్తా: మహారాష్ట్ర గవర్నర్ కు రైతు లేఖ

కాంగ్రెసు, ఎన్సీపీలు శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెసు మద్దతుదారుల్లోని కొన్ని వర్గాలు అంటున్నాయని, ఆ వర్గాల్లో మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు కూడా ఉన్నారని హుస్సేన్ దాల్వాయి సోనియాకు రాసిన లేఖలో అన్నారు. 

బిజెపిపై తెంపు లేకుండా విరుచుకుపడుతున్న శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ గురువారంనాడు ముంబైలో పవార్ ను కలిశారు. దీపావళి సందర్భంగా మర్యాదపూర్వకంగానే పవార్ ను కలిసినట్లు రౌత్ చెప్పారు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అవసరమైన సంఖ్యా బలం తమకు లభిస్తుందని కూడా ఆయన అన్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పవార్ తో శుక్రవారం ఫోన్ లో మాట్లాడారు. అయితే, అటువంటిదేమీ జరగలేదని ఎన్సీపీ అన్నది. 

శాసనసభ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమి 161 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద కూటమిగా అవతరించింది.  మొత్తం స్థానాలు 288. అయితే, బిజెపి  105 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 56 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మంత్రి పదవులు సగం సగం పంచుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా రోటేషన్ పద్దతిలో రెండు పార్టీలు పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. 

ఎన్సీపీ 54 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెసు 44 స్థానాలను గెలుచుకుంది. శివసేనతో కాంగ్రెసు, ఎన్సీపీ కలిస్తే 154 మంది సభ్యులు అవుతారు. అది జరిగితే బిజెపి మైనారిటీలో పడిపోతుంది. అయితే, 24 మంది శివసేన ఎమ్మెల్యేలు తమ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి అంటోంది. 

అయితే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడే ప్రమాదం ఉందని బిజెపి హెచ్చరించింది. దీంతో శివసేన, బిజెపి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడే అవకాశం ఉందని బిజెపి నేత సుధీర్ ముగంటివార్ చేసిన ప్రకటనపై శివసేన తీవ్రంగా మండిపడింది. రాష్ట్రపతి మీ పాకెట్లో ఉన్నాడా అని శివసేన మండిపడింది. శాసనసభ కాల పరిమితి  ఈ నెల 8వ తేదీతో ముగుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios