Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభ తొలిదశ ఎన్నికలు: ఏపీలో మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, భారీగా ఓటింగ్

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ఉదయం 7గంటల నుంచి కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 
 

Lok Sabha Elections Phase 1 2019 Updates
Author
New Delhi, First Published Apr 11, 2019, 9:57 AM IST

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 4గంటలకే ముగిసింది. తొలిదశలో దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.

ప్రజలు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తొలి దశలో ఆంధ్రప్రదేశ్(25), తెలంగాణ(17), ఉత్తరాఖండ్(5), అరుణాచల్ ప్రదేశ్(2), .జమ్మూకాశ్మీర్(2), మేఘాలయ(2), ఛత్తీస్‌గఢ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్, నికోబార్, లక్ష ద్వీప్‌లలో ఒక్కో లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మిగితా రాష్ట్రాల్లోని కొన్ని స్థానాలకు కూడా తొలి దశలో పోలింగ్ జరుగుతోంది.

జమ్మూకాశ్మీర్‌లో ఆత్మాహుతిదాడి అవకాశం

లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో జమ్మాకాశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలీజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఐఈడీతో నింపిన తెలుగు రంగు స్కార్పియో వాహనంతో ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని తెలిపాయి. 

కుల్గాం జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయబడిన ఈ వాహనంతో ఇద్దరు వ్యక్తులు భారీ విస్పోటనానికి వ్యూహం రచించారని, అయితే, ఈ దాడి ఎక్కడ జరుగుతుందన్న విషయంపై తమకు సమాచారం లేదని వెల్లడించాయి. ఈ హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు, భద్రతాదళాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎన్నికల వేళ.. నారాయన్‌పూర్‌లో భారీ పేలుడు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. నారాయణపూర్‌లోని ఫరాస్‌గాం ప్రాంతంలో భారీ ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోయినా.. స్థానికంగా భయాందోళనలకు దారితీసింది. ఇప్పటికే పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

- చెదురుమదురు ఘటనలు మినహా తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

గురువారం సాయంత్రం 5గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్ శాతం.

ఉత్తరాఖండ్: తొలి దశ ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్ రూంకి తరలిస్తున్న పోలింగ్ సిబ్బంది.

బీహార్: పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను తరలిస్తున్న అధికారులు, భద్రతా సిబ్బంది.

బిజ్నోర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో నూతన వరుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కూచ్‌బెహర్ జిల్లాలోని దినహత సబ్ డివిజన్‌కు చెందిన ప్రజలు భారత పౌరులుగా తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2015లో వీరు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్‌లోకి వచ్చారు. వీరిని 2015లో భారత ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది.

- కైరానా బూత్ బయట కాల్పుల జరిగిన తర్వాత దళితులను ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని బీఎస్పీ ఆరోపించింది.

-పశ్చిమబెంగాల్‌లో పలు చోట్ల బీజేపీ నేతల వాహనాలపై దాడులు జరిగాయి.

- గురువారం మధ్యాహ్నం 3గంటల వరకు ఏపీలో 55శాతం పోలింగ్ నమోదు కాాగా, అరుణాచల్‌ప్రదేశ్‌లో 50.87శాతం నమోదైంది.

Voter turnout till 3 pm in Maharashtra is 46.13%. #IndiaElections2019 pic.twitter.com/MelIt4PLZd

మహారాష్ట్రంలో మధ్యాహ్నం 3గంటల వరకు 46.13శాతం ఓటింగ్ నమోదైంది.

జమ్మూకాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 46.17శాతం ఓటింగ్ నమోదైంది.

ఆంధ్రప్రదేశ్: గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గం శ్రీనివాసపురం గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలోనే టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

గురువారం మధ్యాహ్నం 3గంటల వరకు మిజోరాంలో 55.20శాతం, త్రిపుర వెస్ట్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 68.65శాతం, పశ్చిమబెంగాల్‌లో 69.94శాతం పోలింగ్ నమోదైంది.

గురువారం మధ్యాహ్నం 3గంటల వరకు నాగాలాండ్‌‌లో 68శాతం, తెలంగాణలో 48.95శాతం, అస్సాంలో 59.57శాతం, మేఘాలయలో 55శాతం ఓటింగ్ నమోదైంది.

గురువారం మధ్యాహ్నం 3గంటల వరకుక యూపీలో 50.86శాతం ఓటింగ్ నమోదైంది.

ఆంధ్రప్రదేశ్: ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు వైసీపీనే కారణమంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన సతీమణి అమృతా ఫడ్నవీస్ నాగ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలు.

గుంటూరు: సత్తెనపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఏపీ టీడీపీ నేత కోడెల శివప్రసాదరావుపై దాడి జరిగింది.

గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు వివిధ రాష్ట్రాల్లోని ఓటింగ్ శాతం ఇలావుంది. జమ్మూకాశ్మీర్-జమ్మూ, బారాముల్లా స్థానాలు(35.52శాతం), సిక్కిం పార్లమెంటు నియోజకవర్గంలో 39.08శాతం, మిజోరాం పార్లమెంటరీ నియోజకవర్గంలో 46.5శాతం.

టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజహరుద్దీన్ హైదరాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో కొందరు ఐడీ కార్డులు లేకుండానే ఓటు వేసేందుకు ప్రయత్నించడంతో అక్కడి భద్రతాధికారి ఒకరు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం కొంతసేపటి తర్వాత పోలింగ్ కొనసాగింది.

మహారాష్ట్ర: ప్రపంచ పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి ఆమ్గే తన ఓటును నాగ్‌పూర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో వినియోగించుకున్నారు.

సిద్దిపేట జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి.

అనంతపురంలోని తాడిపత్రిలో జరిగిన ఘర్షణలో టీడీపీ నేత ఎస్ భాస్కర్ రెడ్డి మృతి చెందారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే భాస్కర్ మృతి కారణమంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

బీహార్‌లోని పలు నియోజకవర్గాల్లో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు నమోదైన ఓటింగ్ శాతం.

ఏపీ: పూతలపట్టు నియోజకవర్గంలోని బందర్లపల్లిలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యర్తలు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు.

హైదరాబాద్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ సినీనటులు నాగచైతన్య, సమత.

యోగా గురు బాబా రాందేవ్ హరిద్వార్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జమ్మూకాశ్మీర్‌: పూంఛ్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మెషీన్‌లో కాంగ్రెస్ బటన్స్ పని చేయలేదు. ఇదే జిల్లాలో మరో పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో బీజేపీ బటన్స్ పనిచేయలేదు. దీంతో ఆ యంత్రాలను మార్చి కొత్త వాటితో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సుకుమా జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు.

విజయవాడలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

గురువారం ఉదయం 11గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం.

 

హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఈవీఎంలు పనిచేయని కారణంగా ఓటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉదయం 9.30 వరకు కూడా పోలింగ్ ప్రారంభంకాని కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ లేఖను రాశారు.

దిబ్రూగఢ్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న అస్సాం ముఖ్యమంత్రి సర్బనాంద సోనోవాల్.

ఛత్తీస్‌గఢ్: తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్ద దంతెవాడ ప్రజలు.

నాగ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.

హైదరాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎంఐఎం అధినేత, ఇక్కడి ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారులు తీరిన ప్రజలు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారికే తమ ఓటు అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

అనంతపురంలోని గూటి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తా.

ఓటు హక్కు వినియోగించున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు.

బుర్ఖాలో వచ్చిన వారి ముఖాలను తనిఖీ చేయడం లేదని, దీంతో నకిలీ ఓట్లు పడే అవకాశం ఉందని కేంద్రమంత్రి, ముజఫర్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డా. సంజీవ్ బాల్యన్ అన్నారు. వారిని తనిఖీ చేయకుంటే రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తానని అన్నారు.

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత పోతంగల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

మణిపూర్ రాష్ట్రంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన మహిళా ఓటర్లు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబసభ్యులు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన జనం.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ప్రజలు.

తొలిదశ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

నాగ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.

ఎన్నికల సందర్భంగా అస్సాంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని ఇలా అందంగా అలంకరించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios