Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని అభ్యర్ధిని నిర్ణయించలేదు: కేసీఆర్‌తో చర్చలపై విజయన్

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చాలా ముఖ్యమైన విషయాలు చర్చించినట్టుగా  కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో  కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన వివరించారు

KCR-Vijayan discuss how regional players will play bigger role after May 23 election results
Author
Kerala, First Published May 7, 2019, 6:10 PM IST

తిరువనంతపురం: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చాలా ముఖ్యమైన విషయాలు చర్చించినట్టుగా  కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో  కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన వివరించారు.

సోమవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కేరళ సీఎం విజయన్‌తో భేటీ అయ్యారు.ఈ భేటీకి సంబంధించిన వివరాలను విజయన్ మంగళవారం నాడు మీడియాకు వివరించారు. త్వరలోనే సమాఖ్య లౌకిక విధానాలతో కూడిన కేంద్ర ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌తో కీలక సమావేశం నిర్వహించినట్టుగా ఆయన తెలిపారు. 

ప్రధానమంత్రి అభ్యర్ధి గురించి ఈ సమావేశంలో చర్చించలేదన్నారు. కేరళ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేసీఆర్ విజయన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ కుటుంబసభ్యులతో వెళ్లారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను కేసీఆర్ సందర్శిస్తారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios