Asianet News TeluguAsianet News Telugu

కథువా రేప్ కేసు: ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

కథువా రేప్ కేసులో  ఆరుగురిని  దోషులుగా తేల్చింది పఠాన్ కోర్టు. సోమవారం నాడు ఈ మేరకు కోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది.

Kathua murder and rape case verdict announced: Five convicted for murder
Author
New Delhi, First Published Jun 10, 2019, 11:54 AM IST

న్యూఢిల్లీ: కథువా రేప్ కేసులో  ఆరుగురిని  దోషులుగా తేల్చింది పఠాన్ కోర్టు. సోమవారం నాడు ఈ మేరకు కోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది.

గత ఏడాది జనవరి 10వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. గ్రామ సమీపంలోని దేవాలయంలో బాలికను నిర్భంధించి మత్తుమందులిచ్చి  ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. కిడ్నాప్‌కు గురైన బాలిక  మృతదేహం నాలుగు రోజుల తర్వాత లభ్యమైంది.

ఈ ఘటనలో గ్రామ పెద్ద సంజీరామ్, అతని కొడుకు విశాల్,  ఇద్దరు పోలీసులు, మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సాక్ష్యాలను తారు మారు చేసినందుకు గాను నిందితుల నుండి  పోలీసులు రూ. 4 లక్షలు తీసుకొన్నట్టుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిలో ఆరుగురిని దోషులుగా కోర్టు తేల్చింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడిపై విచారణ ఇంకా జరగాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దోషులుగా తేల్చిన ఆరుగురికి ఇవాళ మధ్యాహ్నం కోర్టు శిక్షలను ఖరారు చేయనుంది.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios