Asianet News TeluguAsianet News Telugu

మహిళలే టార్గెట్...గర్భనిరోదక మాత్ర పేరిట సైనెడ్ ఇచ్చి.... నాలుగోసారి మరణ శిక్ష

యువతిని అత్యాచారం చేసి హత్య కేసులో మానవ మృగాడు, సైకో కిల్లర్‌ సైనేడ్‌ మోహన్‌ కుమార్‌ (56)కు మరణ శిక్ష ఖరారయింది.  మంగళూరులోని ఆరో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మహిళపై అత్యాచారం కేసులో అతనిపై నేరారోపణలు రుజువయ్యాయి. 

Karnataka: Serial Killer 'Cyanide Mohan' Sentenced to Death
Author
Hyderabad, First Published Oct 26, 2019, 8:39 AM IST

అతడి టార్గెట్ కేవం మహిళలే. అమ్మాయిలు కనిపిస్తే చాలు.. వెళ్లి మాట కలిపేస్తాడు. తానో పెద్ద మనిషినంటూ... కష్టాలు తీరుస్తానని నమ్మిస్తాడు. అనంతరం.. వాళ్లకి మాయ మాటలు చెప్పి వేరే ప్రాంతానికి తీసుకువెళతాడు. తలనొప్పి ట్యాబ్లెట్ అని చెప్పి.. సైనెడ్ మాత్ర ఇచ్చి సునాయాసంగా వారి ప్రాణాలు తీస్తాడు. అనంతరం వారి వద్ద ఉన్న నగలు, డబ్బులతో ఉడాయిస్తాడు. దానికి ముందు వారిపై అత్యాచారానికి కూడా పాల్పడుతుంటాడు. ఇప్పటి వరకు 20మంది మహిళలను అతి కిరాతకంగా హత్య చేశాడు. కాగా... తాజాగా.. ఓ యువతిపై హత్య కేసులో అతను అరెస్టు కాగా... కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది.

పూర్తి వివరాల్లోకివెళితే... యువతిని అత్యాచారం చేసి హత్య కేసులో మానవ మృగాడు, సైకో కిల్లర్‌ సైనేడ్‌ మోహన్‌ కుమార్‌ (56)కు మరణ శిక్ష ఖరారయింది.  మంగళూరులోని ఆరో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మహిళపై అత్యాచారం కేసులో అతనిపై నేరారోపణలు రుజువయ్యాయి. 

విచారణ పూర్తి కావడంతో బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ సయిదున్నిసా గురువారం శిక్ష ఖరారు చేస్తానని తెలిపారు. గురువారం తీర్పు వెలువరిస్తూ మోహన్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును ధృవీకరించిన తరువాత మరణ శిక్ష అమలు చేయాలని తెలిపారు. హైకోర్టు మరణ శిక్షను ధృవీకరిస్తే ఇతర నేరాల్లో కోర్టులు అతనికి విధించిన శిక్షలను కూడా ఇందులోనే కలిపేయాలని ఆదేశించారు. మొత్తం 17 కేసులకు గాను నాలుగింటిలో అతనికి మరణ శిక్ష ఖరారు అయింది. 

సుమారు పదేళ్ల కిందట... దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా బాళెపుణి అంగనవాడిలో సహయకురాలిగా పని చేస్తున్న యువతిని పరిచయం చేసుకుని, ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చి మెజెస్టిక్‌ వద్ద లాడ్జిలో దిగారు. మరుసటి రోజుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలంటూ సైనేడ్‌ఇచ్చాడు. ఆమె నగలు, డబ్బుతో పరారయ్యా డు. సైనైడ్‌ మింగిన యువతి కొంతసేపటికే మరణించింది. మరో కేసులో అతన్ని పట్టుకుని విచారిస్తుండగా నేరం బయటపడింది. 

అతనికి మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకోవడం, డబ్బుదస్కంతో ఉడాయించడం నైజం. వెళ్తూ వెళ్తూ సైనైడ్‌తో మట్టుబెట్టడంలో ఆరితేరాడు. సుమారు 20 మంది అమాయ మహిళలను ఇలా హత్య చేసినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. 1980 నుంచి 2003 వరకు మంగళూరు ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ సమయంలో నిస్సహాయ మహిళలను గుర్తించి వారితో పరిచయం పెంచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చాడు.  

కేరళ, మంగళూరు తదితర ప్రాంతాల్లో సైనైడ్‌ను ఉపయోగించి తన హత్యా పరంపరపను కొనసాగించాడు. పలువురు మహిళల హత్య కేసుల్లో ఇతనికి 2013లో కూడా మంగళూరు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం, బెదిరించడం వంటి కేసుల్లోనూ మోహన్‌ నిందితుడు. 2007లో బెంగళూరులో ఒక సంగీత ఉపాధ్యాయన్ని నమ్మించి ఇలాగే హత్య చేశాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios