Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీరులో జైషే ఆత్మాహుతి దాడి.. 44 మంది ఆర్మీ జవాన్ల మృతి

భారత  అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ లో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. భారత ఆర్మీ సైనికులను టార్గెట్ గా పుల్వామా జిల్లా  అవంతిపురా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 44 మంది జవాన్లు మృత్యువాతపడగా చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. 

jammu and kashmir bomb blast
Author
Jammu and Kashmir, First Published Feb 14, 2019, 4:42 PM IST

భారత  అంతర్జాతీయ సద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ లో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. భారత ఆర్మీ సైనికులను టార్గెట్ గా పుల్వామా జిల్లా  అవంతిపురా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 44 మంది జవాన్లు మృత్యువాతపడగా చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.  జైషే మొహమ్మద్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలతో ఉన్న కారు సిఆర్పీఎఫ్ కాన్వాయ్ లోకి చొరబడి విధ్వంసాన్ని సృష్టించింది.

సిఆర్పీఎఫ్ జవాన్లు 78 బస్సుల్లో కాన్వాయ్ గా వెళ్తుండగా, పేలుడు పదార్థాలతో నిండిన కారు ఓ బస్సును ఢీకొట్టింది. దాంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. జవాన్ల శరీరాలు తునాతునకలై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఉగ్రవాదాలు మహీంద్రా స్కార్పియోను వాడినట్లు తెలుస్తోంది. అందులో 350 కిలోలకు పైగా పేలుడు పదార్థాలున్నాయి.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌ఫిఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనంపై ఉగ్రవాదులు బాంబులతో తెగబడ్డారు. ఈ దాడి నుండి జవాన్లను కోలుకోనివ్వకుండా పేలుడు  జరిగిన వెంటనే కాల్పులకు కూడా తెగబడ్డారు. ఆత్మాహుతి దళ సభ్యుడితో పేలుడు పదార్థాలతో నిండిన కారును కాన్వాయ్ లోకి పంపి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.

ఈ ప్రమాదంలో 20మంది జవాన్లు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. అలాగే దాదాపు 45 మంది సైనికులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు దాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా ధ్వంసమయ్యింది. 

 ఆర్మీ వాహనంపై బాంబు దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి వుంది. 

భారత ఆర్మీపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జమ్మే కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముప్తీ, ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. దాడిలో ప్రాణాలు  కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు వీరు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ ట్వీట్లు చేశారు. 


 

 

Follow Us:
Download App:
  • android
  • ios