Asianet News TeluguAsianet News Telugu

అవి జోధ్‌పూర్‌ ప్రమాదానివి: విమానాల కూల్చివేతపై ఐఏఎఫ్ స్పందన

భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. అయితే దీనిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఖండించింది. మంగళవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ నిన్నటి నుంచే కవ్వింపు చర్యలకు దిగింది. 

indian air force reacts on pakistan shot down by indian air crafts
Author
Srinagar, First Published Feb 27, 2019, 1:32 PM IST

భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. అయితే దీనిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఖండించింది. మంగళవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ నిన్నటి నుంచే కవ్వింపు చర్యలకు దిగింది.

దీనిలో భాగంగా సరిహద్దుల వెంబడి కాల్పులకు దిగింది. అక్కడితో ఆగకుండా పాక్‌కు చెందిన రెండు ఎఫ్-16 ఫైటర్ల నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన భారత వైమానిక దళం.. పాక్ యుద్ధ విమానాలను వెంబడించాయి.

తాము భారత్‌కు చెందిన రెండు విమానాలు కూల్చివేసినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. అయితే దీనిపై స్పందించిన భారత వాయుసేన తాము ఒక ఎఫ్-16 విమానాన్నా కూల్చివేశామని, దానిలోని పైలట్ పారాచ్యూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ వైపు తప్పించుకుని పారిపోయినట్లు తెలిపింది.

దానితో పాటు పాక్ మీడియాలో వస్తున్న దృశ్యాలు.. జోధ్‌పూర్‌లో కూలిపోయిన మిగ్-27 ఫైటర్‌దని తెలిపారు. పాత దృశ్యాలు చూపించి పాక్ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని విమర్శించింది. 

రెండు భారత యుద్ద విమానాలను కూల్చినట్లు ప్రకటించిన పాక్

బడ్గాంలో కుప్పకూలిన మిగ్ యుద్ధ విమానం: ఇద్దరు పైలైట్లు మృతి

పాక్ విమానాన్ని కూల్చేసిన ఎయిర్‌ఫోర్స్: తప్పించుకున్న పైలట్

Follow Us:
Download App:
  • android
  • ios