Asianet News TeluguAsianet News Telugu

ఇంజిన్ లేని తొలి రైలు .. నేటి నుంచి ట్రయల్ రన్

ఇందులో సీట్లు 360 డీగ్రిల కోణంలో తిరుగుతాయి. మొత్తం ఎయిర్‌ కండీషన్డ్‌ బోగీలనే దీనికి అమర్చారు. ఇందులో వైఫై, వాక్యూమ్‌ టాయిలెట్స్‌, స్లైడింగ్‌ డోర్స్‌ ఉంటాయి.

India's first engine-less train, Train 18, to go on trial run today
Author
Hyderabad, First Published Nov 17, 2018, 12:07 PM IST

ఇంజిన్ లేని తొలి రైలు... మన దేశంలో పట్టాలెక్కనుంది. ట్రైన్18 పేరిట తయారుచేసిన  ఈ ఇంజిన్ లేని రైలు తొలి ట్రయల్ రన్ అక్టోబర్ 29న  చేయగా.. మరోసారి శనివారం ట్రయల్ రన్ చేపట్టనున్నారు. 

ట్రయల్ రన్ నిర్వహణలో భాగంగా ఇప్పటికే రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) అధికారుల బృందం మోర్దాబాద్‌కు చేరుకుంది. రూ. 100 కోట్ల వ్యయంతో దేశయ హైటెక్నాలజీతో శక్తివంతమైన సెమీ హైస్పీడ్ ట్రైన్‌ను రూపొందించారు. ఈ సెమీ ట్రైన్‌ను చెన్నైలో రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం లో స్పీడ్‌తో ఈ ట్రైన్‌ను వివిధ పద్ధతుల్లో పరీక్షించారు.

ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ ఎస్ మణి ఈ హై స్పీడ్ ట్రైన్‌ను తయారుచేశారు. ఈ నెల 11న ఫ్రీ ట్రయల్స్ ద్వారా బయల్దేరిన ట్రైన్ 18.. నవంబర్ 13న ఢిల్లీకి చేరుకుంది. మరుసటి రోజున సర్దార్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో ఈ ట్రైన్‌ను మీడియా ముందు ప్రదర్శనకు ఉంచారు. ఈ ట్రైన్ 18 సర్వీసులను ముందుగా మోర్దాబాద్, బరెల్లి మీదుగా మధ్యస్థంగా నిర్వహించనున్నారు.

ఈ ట్రెయిన్ చూడటానికి బులెట్ ట్రైన్ లా ఉంటుంది. దాదాపు 200కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఇందులో సీట్లు 360 డీగ్రిల కోణంలో తిరుగుతాయి. మొత్తం ఎయిర్‌ కండీషన్డ్‌ బోగీలనే దీనికి అమర్చారు. ఇందులో వైఫై, వాక్యూమ్‌ టాయిలెట్స్‌, స్లైడింగ్‌ డోర్స్‌ ఉంటాయి. రెండు ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లతో కలిపి మొత్తం 16ఏసీ పెట్టెలు ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios