Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్6న చంద్రునిపైకి చంద్రయాన్ 2

చంద్రునిపైకి మరో మూడు మాడ్యుళ్లను పంపేందుకు ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. చంద్రయాన్ 2 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన విడుదల చేసింది. 

India likely to land on Moon on September 6
Author
Hyderabad, First Published May 2, 2019, 10:43 AM IST

చంద్రునిపైకి మరో మూడు మాడ్యుళ్లను పంపేందుకు ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. చంద్రయాన్ 2 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్బిటర్, ల్యాండర్(విక్షం), రోవర్( ప్రజ్ఞాన్‌) పేరిట మూడు మాడ్యుళ్లను జీఎస్ఎల్వీ ఎంకే3 లాంచ్ వెహికల్ తో ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

చంద్రుడి ఉపరితలానికి చేరువలో ఆర్బిటర్‌, దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌, ఉపరితలంపై ప్రయోగాలను నిర్వహించేందుకు అనువుగా రోవర్‌ను తయారుచేశారు. చంద్రయాన్‌-2 ప్రయోగంను జులై 9 నుంచి 16 మధ్యలో ప్రయోగిస్తారు. 2019 సెప్టెంబరు ఆరవ తేదీ నాటికి ఇవి చంద్రునిపైకి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇస్రో అధికారులు. 

Follow Us:
Download App:
  • android
  • ios