Asianet News TeluguAsianet News Telugu

బంగాళాఖాతంలో వాయుగుండం... పొంచివున్న తుపాను ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి బారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.  

IMD predicts heavy rainfall in odisha, west bengal
Author
Visakhapatnam, First Published Nov 5, 2019, 8:37 PM IST

విశాఖపట్నం: తూర్పు, మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది  ఒడిషాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 890 కిలోమీటర్ల దూరాన, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ దీవులకు 980 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయాన కేంద్రీకృతమై వుందని తెలిపారు. ఇది ఇవాళ రాత్రికి  మరింత తీవర్నమైన వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. 

ఇది రేపు(బుధవారం) సాయంకాలానికి తుపానుగా మారనుందని తెలిపారు. ఇది మొదట పశ్చిమ వాయువ్యంగా, అనంతరం ఉత్తర వాయవ్యంగా పయనించి  ఉత్తర ఒడిషా, బెంగాల్ మీదికి పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఈ నెల 9వ తేదీ నుంచీ ఒడిషా, బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ మీద ఉంటుందన్నారు. అయితే కోస్తాంధ్రకు దీని ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ అధికారుల అంచనా వేస్తున్నారు.

read more  బాత్రూంల పక్కన కూర్చుని పవన్ ఏం చేశాడంటే...: కన్నబాబు సంచలన వ్యాఖ్యలు

అక్టోబర్ నెలలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 63 శాతం అధికంగా వర్షాలు నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షపాతం నమోదైంది.

పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి తెలంగాణలో సగటు వర్షపాతం 84.1 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు 137.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

video: జగన్ సొంత జిల్లాలో దారుణం: ఎమ్మార్వో కార్యాలయంలోనే అన్నదాత ఆత్మహత్యాయత్నం

అక్టోబర్ మూడో వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఉంటుందన్న ఇండో-జర్మన్ పొట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ శాస్త్రవేత్తల అంచనా నిజమైంది. టిప్పింగ్ ఎలిమెంట్ విధానం ద్వారా ఈ సంస్థ నాలుగేళ్లుగా వాతావరణ మార్పులపై అంచనా వేస్తోంది.

అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వివిధ రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా దీని ప్రభావం ఓడిషా, పశ్చిమ బెంగాల్ ల పైనే వుండగా కోస్తాంద్ర పై స్వల్పంగా వుండే అవకాశముంది. అయితే మోస్తరు వర్షాలు మాత్రమే కోసాంద్రలో కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios